Brow Theatrical Trailer :వచ్చే వారం లోనే పవన్ కళ్యాణ్  ‘బ్రో ది అవతార్’ థియేట్రికల్ ట్రైలర్

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని వచ్చే వారం లోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Written By: Vicky, Updated On : July 9, 2023 1:14 pm
Follow us on

Brow Theatrical Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ‘బ్రో ది అవతార్’ మూవీ హంగామా మొదలైంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. మోషన్ పోస్టర్స్ తోనే మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ తో మంచి హైప్ ని దక్కించుకుంది. ఇక నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘మై డియర్ మార్కండేయ’ విడుదలై మొదట్లో కాస్త నెగటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని ఇప్పుడు స్లో పాయిజన్ గా దూసుకుపోతుంది.

ఇంకా ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు విడుదల అవ్వాల్సి ఉంది. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని వచ్చే వారం లోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ థియేట్రికల్ ట్రైలర్ కట్ జరిగి చాలా కాలమే అయ్యిందని, టీజర్ ని కట్ చేసిన రోజే, ట్రైలర్ ని కూడా కట్ చేసారని ఈ చిత్రానికి సంబంధించిన సన్నిహిత వర్గాలు తెలియచేస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రం లోని పవన్ కళ్యాణ్ లుక్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఒక్కసారిగా జల్సా, ఖుషి రోజుల్లోకి వెళ్లిపోయాడని, తమ అభిమాన హీరో ని ఇంత స్టైలిష్ గా చూపించినందుకు ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డైరెక్టర్ సముద్ర ఖని కి మరియు రచయితా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చెప్తున్నారు. టీజర్ తో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా , ట్రైలర్ తో ఆ అంచనాలను రెట్టింపు చేస్తుందా లేదా తగ్గిస్తుందా అనేది చూడాలి.