PKSDT Bro Poster Records: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతీ విషయం ఘనంగా ఉండాలని అభిమానులు చూస్తూ ఉంటారు. ఆయన చేసే సినిమాలకు ఫస్ట్ లుక్ దగ్గర నుండి బాక్స్ ఆఫీస్ వరకు ప్రతీ ఒక్కటి ఆల్ టైం రికార్డు ఉండేలా చూస్తారు. నిన్న ఆయన హీరో గా నటించిన ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది. దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఎవ్వరూ ఊహించని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటు గా సాయి ధరమ్ తేజ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.తమిళం లో డైరెక్ట్ ఓటీటీ విడుదలై మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ ని రప్పించుకున్న ‘వినోదయ్యా చిత్తం’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.
ఇక ఈ సినిమా మోషన్ పోస్టర్ యూట్యూబ్ సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు మోషన్ పోస్టర్ రికార్డ్స్ మన టాలీవుడ్ లో పాన్ ఇండియన్ చిత్రాల పేరు మీదనే ఉంది. ప్రభాస్ హీరో గా నటించిన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ కి 24 గంటల్లో 4.75 మిలియన్ వ్యూస్ రాగా, #RRR చిత్రానికి 4.64 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ బ్రో చిత్రానికి కేవలం 17 గంటల్లోనే రాధే శ్యామ్ మరియు #RRR మూవీ మోషన్ పోస్టర్ వ్యూస్ ని దాటేసి 4.8 మిలియన్ వ్యూస్ ని సాధించింది.లైక్స్ కూడా దాదాపుగా 1 లక్ష 20 వేలు వరకు వచ్చింది.ఇక 24 గంటల్లో ఈ మోషన్ పోస్టర్ కి 5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది, చూడాలి మరి.