Pawan Kalyan Bro Teaser: కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ టీజర్ ని నిన్న సాయంత్రం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు ఫ్యాన్స్ కి అద్భుతమైన బహుమతి ఇచ్చారని, వింటేజ్ పవర్ స్టార్ ని చూస్తుంటే జులై 28 వ తారీఖు వరకు ఆగలేకున్నామని, ఈ రేంజ్ ఔట్పుట్ ఇస్తారని అసలు ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
అలాగే రికార్డ్స్ వేట కూడా ఇన్ని రోజులు ఆకలి మీద ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుందో, అలా వేటాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నిన్న ఈ టీజర్ ని విడుదల చేసిన 15 నిమిషాల్లోనే రెండు మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది ఆల్ టైం ఫాస్టెస్ట్ 2 మిలియన్ టీజర్ అని చెప్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఆ తర్వాత 20 నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్ దక్కాయి, ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, లైక్స్ విషయం లో మాత్రం బాగా వెనుకబడ్డారు. 24 గంటలకు కలిపి ఈ టీజర్ కి కేవలం మూడు లక్షల 25 వేల లైక్స్ మాత్రమే వచ్చాయి. దీనిని పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ టీజర్ కేవలం మూడు గంటలోపే దాటేసింది.
మూడు గంటల్లో ఈ టీజర్ కి దాదాపుగా మూడు లక్షల 50 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ టీజర్ కి ముందు లైక్స్ కొట్టేందుకు మల్టిపుల్ యూట్యూబ్ చానెల్స్ వంటివి ఏమి కూడా క్రియేట్ చెయ్యలేదు. ఎలాంటి ప్రిపరేషన్స్ కూడా చెయ్యలేదు. జెన్యూన్ గా వచ్చిన రీచ్ ఇది అని అంటున్నారు ఫ్యాన్స్, మరి 24 గంటలు ముగిసిన తర్వాత ఈ టీజర్ ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి.