https://oktelugu.com/

Adipurush – Bro Movies :  ‘ఆదిపురుష్’ థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ సరికొత్త మోషన్ పోస్టర్

అదేమిటి అంటే 'ఆదిపురుష్' సినిమాని కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నే పవన్ కళ్యాణ్ 'బ్రో ది అవతార్ మూవీ ని కూడా నిర్మించింది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త మోషన్ పోస్టర్ ని 'ఆదిపురుష్' మూవీ తో అటాచ్ చేశారట.

Written By:
  • Vicky
  • , Updated On : June 15, 2023 / 01:39 PM IST
    Follow us on

    Adipurush – Bro Movies : కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఆదిపురుష్’ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమా విడుదల కాలేదు.

    అందువల్ల ఆడియన్స్ మొత్తం ‘ఆదిపురుష్’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు, దానికి తోడు ట్రైలర్స్ మరియు పాటలు అద్భుతంగా ఉడడంతో అంచనాలు పదింతలు ఎక్కువ పెంచేసింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆదిపురుష్ టికెట్స్ కోసం ఒక మినీ యుద్ధమే నడుస్తుంది. ఈ ట్రెండ్ ని మరింత జోరు పెంచడానికి లేటెస్ట్ గా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టిస్తుంది.

    అదేమిటి అంటే ‘ఆదిపురుష్’ సినిమాని కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నే పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్ మూవీ ని కూడా నిర్మించింది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సరికొత్త మోషన్ పోస్టర్ ని ‘ఆదిపురుష్’ మూవీ తో అటాచ్ చేశారట. ఇంటర్వెల్ లో ‘బ్రో’ మోషన్ పోస్టర్ ప్లే అవ్వుధి.ఈ వార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆదిపురుష్ మూవీ టికెట్స్ తెంపుతున్నారు.

    ఇప్పటికే ఫ్రీ టికెట్స్ పేరుతో భారీ పబ్లిసిటీ ప్రారంభించిన మూవీ టీం, ఇప్పుడు ఇలా మరో సరికొత్త పబ్లిసిటీ స్టంట్ తో ఆదిపురుష్ మూవీ పై హైప్ పెంచుతున్నారని తెలుస్తుంది. టీజర్ ని చూసి వెక్కిరించిన ప్రతీ ఒక్కరు, నేడు ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇక విడుదల తర్వాత ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.