https://oktelugu.com/

Pawan Kalyan Wife: ఉపాసన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినావా ఇంత చేసిందా..చూస్తే ఆశ్చర్యపోతారు!

Pawan Kalyan Wife: పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజినావా ఎంత మంచి సేవా భావాలు ఉన్న మహిళ అనేది అందరికీ తెలిసిందే. ఈమె దేశం రష్యా అయ్యినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత భారతీయ సంస్కృతి ని నేర్చుకొని, మన సంప్రదాయాలను తూచా తప్పకుండ ఫాలో అవుతుంది. ఇండస్ట్రీ లో మనకి తెలిసిన తెలుగు అమ్మాయిలు మన దేశ సంప్రదాయాలను ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ, అన్నా లెజినావా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 9, 2023 / 10:47 AM IST
    Follow us on

    Pawan Kalyan Wife: పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజినావా ఎంత మంచి సేవా భావాలు ఉన్న మహిళ అనేది అందరికీ తెలిసిందే. ఈమె దేశం రష్యా అయ్యినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత భారతీయ సంస్కృతి ని నేర్చుకొని, మన సంప్రదాయాలను తూచా తప్పకుండ ఫాలో అవుతుంది. ఇండస్ట్రీ లో మనకి తెలిసిన తెలుగు అమ్మాయిలు మన దేశ సంప్రదాయాలను ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ, అన్నా లెజినావా మాత్రం కచ్చితంగా ఫాలో అవుతుంది.

    పవన్ కళ్యాణ్ ఆమెని అలా మలిచాడు. ఇక ఇంట్లో వాళ్ళతో కూడా ఈమె చాలా తొందరగా కలిసిపోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా నాగబాబు తెలిపాడు.ముందు ఉన్న అమ్మాయి మాతో అంతగా కలిసేది కాదు, కానీ ఇప్పుడు వచ్చిన అమ్మాయి మాత్రం మా కుటుంబం లో ప్రతీ ఒక్కరితో కలిసి పోయింది. మా కళ్యాణ్ బాబు కి సరైన జోడి అంటే ఇలాగే ఉండాలి అనిపించింది.

    అలా నాగబాబు గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భం దాల్చిన ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా బయటకి రావాలనే మంచి ఉద్దేశ్యం తో అన్నా లెజినావా రష్యా నుండి విటమిన్స్ తో కూడిన అరుదైన ఫలాలను తెప్పించి ఉపాసన కి బహుమతి గా ఇచ్చిందట. ఉపాసన ఈ బహుమతిని చూసి ఎంతో సంబరపడిందట, తన కోసం ఇంత శ్రద్ద చూపించినందుకు అన్నా లెజినావా కి కృతఙ్ఞతలు తెలియచేసిందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరో పక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉపాసన పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపించినందుకు కృతఙ్ఞతలు అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.