Hara Veera Mallu Pre Release Event: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముందుగా ఈ ఈవెంట్ ని ఒక ఓపెన్ గ్రౌండ్ లో లక్షలాది మంది అభిమానుల సమక్ష్యం లో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల శిల్ప కళా వేదిక లోనే జరిపించాల్సి వచ్చింది. ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖుల కంటే ఎక్కువగా, రాజకీయ నాయకులే ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ/టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ తదితరులు ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. స్పీచ్ తో మళ్లీ అదరగొట్టిన పవన్!
తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి కూడా రావాల్సింది కానీ, ఆయన సీఎం తో అత్యవసర సమావేశం ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. అయితే ఈ ఈవెంట్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక ఆకర్షణ గా నిల్చింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా ఈవెంట్స్ కి తన భార్య తో కలిసి రావడం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. అలాంటిది కొత్తగా ఇప్పుడు ఆయన తన భార్య తో కలిసి రావడం హాట్ టాపిక్ గా మారింది. అలా రావడానికి కూడా పలు కారణాలు ఉన్నాయట. ఈ ఈవెంట్ కి అత్యధిక శాతం రాజకీయ నాయకులూ రావడంతో వాళ్ళ కోసమే మర్యాదగా ఉంటుందని తన భార్య తో కలిసి వచ్చాడని అంటున్నారు. కచ్చితంగా కారణం అదే అయ్యి ఉండకపోయి ఉండొచ్చు కానీ, ఈమధ్య కాలం లో ఆయన ఎక్కువగా తన సతీమణి ని రాష్ట్ర కార్యకలాపాలలో భాగం అయ్యేలా చేస్తున్నాడు. ఇది ఆయన అభిమానులకు కూడా సర్ప్రైజ్ గానే ఉంది.