Pawan Kalyan Wife Anna Lezhneva Comments: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ‘తీన్ మార్’ చిత్రం ఎంత ప్రత్యేకం. అప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం పెద్దగా అర్థం కాలేదు కానీ , నేటి తరం ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగత జీవితం విషయం లో చాలా సహాయపడింది. ఈ సినిమా సమయం లోనే పవన్ కళ్యాణ్ కి అన్నా లెజినోవా పరిచయం అవ్వడం , ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అన్నా లెజినోవా తో పవన్ కళ్యాణ్ దాంపత్య జీవితం ఎంతో గొప్పగా కొనసాగుతోంది. పేరుకే ఈమె రష్యా దేశానికీ చెందిన మనిషి, కానీ మన ఇండియన్ కల్చర్ ని తూచా తప్పకుండా అనుసరించడం లో ఈమె దిట్ట.
అయితే రీసెంట్ గానే ఈమె ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెల్సిందే. ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి, యాక్టీవ్ గా తన డైలీ రొటీన్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా అభిమానులు అడిగే పలు ప్రశ్నలకు , సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే కొన్ని వార్తలకు కూడా ఆమె ఎప్పటికప్పుడు రెస్పాన్స్ ఇస్తుంది. అయితే చాలా రోజుల నుండి ‘తీన్ మార్’ మూవీ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఒక రష్యా అమ్మాయితో కలిసి కూర్చున్న ఫోటోలను తిప్పుతూ , ఈమెనే అన్నా లెజినోవా అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేశారు. అయితే ఈ ఫోటో ని నిన్న అన్నా లెజినోవా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ , ‘ఈ ఫొటోలో కనిపిస్తున్న అందమైన అమ్మాయి నేను కాదు, ఆమె పేరు దాణా మార్క్స్ ‘ అంటూ చెప్పుకొచ్చింది.
పవన్ కళ్యాణ్ కి ‘తీన్ మార్’ చిత్రం ద్వారానే అన్నా లెజినోవా పరిచయం అయ్యింది . కానీ ‘బార్బీ బొమ్మకు చెల్లిలివా’ పాటలో ఒక్క చిన్న షాట్ లో మాత్రమే అన్నా లెజినోవా కనిపిస్తుంది , అందులో ఒక హీరోయిన్ గా మాత్రం ఆమె నటించలేదు. అభిమానులు కూడా ఇన్ని రోజులు ‘తీన్ మార్’ ఆడియో ఫంక్షన్ లో పవన్ పక్కన కూర్చున్న దానా మార్క్స్ ని అన్నా లెజినోవా అనుకోని పొరపాటు పడ్డారు. ఇప్పుడు స్వయంగా అన్నా లెజినోవా నే క్లారిటీ ఇవ్వడం తో అభిమానులకు కూడా క్లారిటీ వచ్చేసింది.