Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ పని తీరు ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఆయన జనాల్లో ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు కానీ, అధికారం లోకి వచ్చిన తర్వాత ఎదో ఒక అద్భుతమైన కార్యక్రమం తో ప్రతీరోజు జనాల్లోనే ఉంటున్నాడు. కేవలం 50 రోజుల్లోనే 11 వేలకు పైగా సీసీ రోడ్లను నిర్మించి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇలాంటి నాయకుడు మనకి కూడా ఉంటే ఎంత బాగుండును అనే రేంజ్ లో ఆయన పరిపాలన సాగుతుంది. రాజకీయంగా ఆయన ప్రతీ రోజు అభిమానులు గూస్ బంప్స్ రప్పిస్తునే ఉన్నాడు. ఇప్పుడు సినీ హీరోగా ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్ అనుభూతిని ఇవ్వడమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న మూడు సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది.
సుమారుగా ఐదేళ్ల నుండి ఈ చిత్రం సెట్స్ మీద ఉంది. మధ్యలో కరోనా రావడం వల్ల షూటింగ్ ని చాలా కాలం వరకు నిలిపేయగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ అవ్వడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఈ చిత్రం. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు చివరి దశకి చేరుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. త్వరలోనే ఆయన ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టబోతున్నాడు. మార్చి 28 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ పాటని స్వయంగా పవన్ కళ్యాణ్ పాడాడట. దసరా కే ఈ పాటని విడుదల చేయాలని అనుకున్నారు కానీ, కీరవాణి కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది.
కేవలం తెలుగు బాషలోనే కాదు, పవన్ కళ్యాణ్ హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలో కూడా పాటని పాడాడట. రాజకీయాల్లో ఇంత బిజీ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇంత వర్క్ ఎప్పుడు చేసాడని అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1 , అర్థ రాత్రి 12 గంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారట మేకర్స్. సినిమాకి ఈ సాంగ్ పెద్ద హైలైట్ గా నిలుస్తుందట. అడవిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తన స్నేహితులతో కలిసి పాడిన పాటగా చెప్తున్నారు మేకర్స్. రెండు నుండి మూడు నిమిషాల నిడివి ఉంటుందట. ఈ పాట దగ్గర నుండి సినిమాకి నాన్ స్టాప్ ప్రొమోషన్స్ మొదలు అవుతాయని, సంక్రాంతికి విడుదల చేయబోయే టీజర్ ఫ్యాన్స్, ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యేలా చేస్తుందని నిర్మాత ఏఎం రత్నం తన సన్నిహితులతో చెప్పాడట.