Pawan Kalyan Instagram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక ప్రభంజనమే అని అభిమానులు ఊరికే అనరు, రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం కోసం ఆయన ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోడు. కానీ రికార్డ్స్ మాత్రం సహజం గానే ఆయన వెనపడుతాయి. ఇక నిన్న ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్, ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు ని నెలకొల్పాడు. బహుశా ప్రపంచం లోనే ఇలాంటి రికార్డు ని ఆయన తప్ప ఎవ్వరూ క్రియేట్ చెయ్యలేరు ఏమో.
అదేమిటంటే పవన్ కళ్యాణ్ నిన్న ఇంస్టాగ్రామ్ లోకి అడుపెట్టిన అతి తక్కువ సమయం లోనే 1 మిలియన్ కి పైగా ఫాలోవర్లు ఆయనని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఉదయం 11 గంటల సమయం లో ఆయన ఇంస్టాగ్రామ్ లోకి రాగా, సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాలకు 1 మిలియన్ ఫాలోయర్స్ మార్కుని దాటేసారు. మన టాలీవుడ్ హీరోలకు ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టి 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని దక్కించుకోవడానికి రోజుల సమయం పట్టింది.
కానీ పవన్ కళ్యాణ్ కేవలం గంటల వ్యవధిలోనే ఈ మార్కుని అందుకొని సరికొత్త చరిత్ర సృస్టించాడు. ప్రపంచం లోనే అత్యంత వేగవంతంగా 1 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకున్న టాప్ 10 సెలబ్రిటీస్ లో ఒకడిగా నిలిచాడు. ‘వీ ఆఫ్ BTS’ కి కేవలం 43 నిమిషాల్లో 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని దక్కించుకొని టాప్ 1 స్థానం లో నిలవగా, ఏంజిలీనా జోలీ 59 నిమిషాలతో టాప్ 2 , తమిళ హీరో విజయ్ కి 99 నిమిషాల్లో టాప్ 3 , ఏం -టెయ్ ఇల్ కి ఒక గంట 45 నిమిషాలతో నాల్గవ స్థానం లో , అలా ఎంతో మంది వరల్డ్ టాప్ స్టార్స్ జాబితాలో J అనిస్టన్ తర్వాతి స్థానం లో టాప్ 9 గా 6 గంటల 20 నిమిషాల వ్యవధి లో 1 మిలియన్ ఫాలోవర్స్ ని దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్.
అంత మంది టాప్ హాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య, ఒక తెలుగోడు నిలవడం అనేది నిజంగా మనమంతా ఎంతో గర్వించదగ్గ విషయం. ఇదంతా కేవలం ఒక్క పోస్టు కూడా వెయ్యకుండా వచ్చినదే, ఆయన ఒక పోస్ట్ వేసి ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే కచ్చితంగా టాప్ 5 స్థానం లో ఉండేవాడు.