Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. సినిమా టికెట్స్ ధరల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సీఎం జగన్ ను తీవ్రంగా విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో ఒక్కరోజు దీక్ష చేపట్టిన పవన్, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంతానికి దిగితే తన సినిమాలు ఏపీలో ఉచితంగా ప్రదర్శిస్తానని, పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే.
టికెట్స్ ధరల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు వంటి నిర్ణయాలు కేవలం తనను ఆర్థికంగా దెబ్బతీయడానికేనని పవన్ ఘాటుగా స్పందించారు. ఇక గతంలో రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా కూడా పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. తనను ఇబ్బంది పెట్టడం కోసం చిత్ర పరిశ్రమ మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నట్లు విమర్శించారు. కాగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ దీక్ష వేదికగా తన సినిమాలు ఏపీలో ఉచితంగా ప్రదర్శిస్తానన్న పవన్ కామెంట్ ని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు పవన్ ని టార్గెట్ చేస్తున్నారు.
నువ్వు నిర్మాతవు కాదుగా పవన్, ఉచిత ప్రదర్శన వలన నీకు పోయేదేముంది. నష్టం మొత్తం నిర్మాతకే కదా. ఇలాంటి మాటలు ఎన్నైనా చెబుతావని కౌంటర్లు విసురుతున్నారు. నువ్వు స్వయంగా నిర్మించి నటించిన చిత్రాలు ఉచితంగా విడుదల చేసి.. నీ సవాల్ కి పరిపూర్ణత చేకూర్చు అంటూ… సెటైర్స్ వేస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీ నుండే ఈ నిర్ణయం అమలు చేయాలని, యూట్యూబ్ లో నేరుగా విడుదల చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
అదే సమయంలో పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వాళ్ల కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు. మా అన్న పట్టుదల మీకు తెలియదు. అవసరం అయితే ఏపీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకొని, ఉచితంగా ప్రదర్శిస్తాడు… అంటూ యాంటీ ఫ్యాన్స్ డౌట్స్ కి క్లారిటీ ఇస్తున్నారు. నా సినిమాలు జనాలకు ఉచితంగా చూపిస్తా… అన్న పవన్ కామెంట్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య డిబేట్ కి దారి తీసింది.
Also Read: Pawan Kalyan: చేతగాని వైసీపీ మనకు అవసరమా? విశాఖ ‘ఉక్కు’ మంటలు వైసీపీపై రాజేసిన పవన్
కాగా రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన ప్రసంగం రాజకీయంగా చాలా దుమారం రేపింది. చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పరిచింది. ఈ క్రమంలో టాలీవుడ్ బడా నిర్మాతలు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్రభుత్వంతో పరిశ్రమ పెద్దల చర్చలు ఫలించలేదు. అసెంబ్లీ సాక్షిగా టికెట్స్ ధరల తగ్గింపు నిర్ణయం చట్టబద్దం చేసినా కూడా పవన్ ఎందుకో స్పందించలేదు. దాదాపు రెండు నెలల అనంతరం పవన్ ఈ విషయంపై నోరు విప్పారు.
Also Read: Pushpa Movie: “పుష్ప” సినిమా నాలుగు సినిమాల కష్టం అంటున్న: అల్లు అర్జున్