Pawan Kalyan Warning: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోలు మాత్రం కొంతమందే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)లాంటి నటుడు కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లను సాధిస్తూ స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పట్లో ఈయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అంతకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా రిలీజ్ కి రెడీ అయిన నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
నిజానికి ఈ సినిమా ఇప్పటికీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వకపోవడం వల్ల ఎప్పటికప్పుడు ఈ సినిమా డిలే అవుతూ వస్తుంది. ఇక జూలై 25వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: Poonam Kaur: నన్ను కార్నర్ చేయడం అంత ఈజీ కాదమ్మా… పూనమ్ దిమ్మతిరిగే కౌంటర్
మరి ఈ డేట్ కి అయిన ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలు అయితే బయటికి వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి.
అలాగే ఈ సినిమా యూనిట్ కి పవన్ కళ్యాణ్ సైతం వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి అహర్నిశలు కష్టపడినా ఈ సినిమాని అనుకున్న టైమ్ కి రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి అని ప్రొడ్యూసర్ దర్శకుడికి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడట. మరి వాళ్ళు అనుకున్న విధంగానే సినిమా వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…