Akira Nandan hero debut: సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే వారసత్వంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. వాళ్ళు మాత్రమే స్టార్ పొజిషన్ ని అందుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా అకీరా నందన్ సైతం యాక్టింగ్ విషయం చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడట. ఇప్పటికే యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్న అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఎప్పుడిస్తాడు అంటూ అభిమానులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన విషయం మీద పవన్ కళ్యాణ్ పూర్తి సుముకతో ఉన్నాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం అంత ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదట. పవన్ కళ్యాణ్ తనను హీరో చేయాలనుకుంటుంటే, ఆమె మాత్రం అకిరానందన్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని తను మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతాడు అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెబుతుంది.
నిజానికి అకీరా నందన్ కి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని దాని మీద ఆసక్తి చూపిస్తే బాగుంటుంది అంటూ పలువురు వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అకీరా నందన్ ప్రేక్షకులను మెప్పించగలిగేలా నటిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… తండ్రికి తగ్గ తనయుడిగా తన పేరు నిలబెడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
నిజంగా తనకి హీరో అవ్వాలని ఉంటే ఎంత తొందరగా హీరోగా ఎంట్రీ ఇస్తే అంత బాగుంటుందని దానివల్ల ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశం కూడా దక్కుతుందని పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక నిజానికి అకీరా హైట్ చాలా ఎక్కువ గా ఉంటాడు.
కాబట్టే తనకు మాస్ యాక్షన్ సినిమాలైతే బాగా సెట్ అవుతాయని పలువురు సినిమా మేధావులు సైతం చెబుతున్నారు..ఇక పవన్ కళ్యాణ్ తనను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ వైపు అకిరా నందన్ నిలుస్తాడా? లేదంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతాడా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…