https://oktelugu.com/

Vakeel Saab Movie: ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ లో ” వకీల్ సాబ్ “…

Vakeel Saab Movie: సౌత్ ఇండియన్ హీరోలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుంది అని చెప్పాలి. తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్ మొత్తాన్ని కోలీవుడ్ సినిమాలే ఆక్రమించుకోవడం గమనార్హం. 2021లో భారతదేశంలో అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రాలలో విజయ్ ‘మాస్టర్’ మొదటి స్థానంలో నిలిచింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 04:31 PM IST
    Follow us on

    Vakeel Saab Movie: సౌత్ ఇండియన్ హీరోలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుంది అని చెప్పాలి. తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్ మొత్తాన్ని కోలీవుడ్ సినిమాలే ఆక్రమించుకోవడం గమనార్హం. 2021లో భారతదేశంలో అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రాలలో విజయ్ ‘మాస్టర్’ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో మరో ‘వాలిమై’ ఉంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకపోయినప్పటికీ కేవలం ప్రోమో, మేకింగ్ తోనే ఈ రికార్డును క్రియేట్ చేసింది.

    Vakeel Saab Movie

    Also Read: బాలయ్య ‘అఖండ’ సీక్వెల్ కథ అదే !

    అలానే విజయ్ ‘బీస్ట్’ కూడా చిత్రీకరణ దశలో ఉన్నప్పటికీ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక సూర్య ‘జై భీమ్’ ఈ లిస్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ 4వ స్థానంలో ఉంది. ఇక చివరగా అంటే 5వ స్థానంలో ‘వకీల్ సాబ్’ నిలిచింది. పవన్ మూవీ ఈ సంవత్సరంలో అత్యధికంగా ట్వీట్ చేసిన చలనచిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. కరోనా సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబ‌ట్టింది. పవర్ స్టార్ కి జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. అంజలి, నివేదా థామస్, అనన్య ఈ చిత్రానికి కీలక పాత్ర పోషించారు. కాగా తమన్ స్వరాలు కూడా మూవీ లో హైలెట్ గా నిలిచాయి. మగువ మగువ పాట హిట్ గా నిలిచింది.

    Also Read: సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పై బోల్డ్‌గా స్పందించిన పాయ‌ల్…