Vikrant Rona: 14 భాషల్లో అలరించనున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్…

Vikrant Rona: రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు. తర్వాత వచ్చిన బాహుబలి సినిమాలో కూడా ఓ పాత్రలో మెప్పించారు సందీప్. ‌ హిందీ తమిళ తెలుగు అన్ని భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందగా తాజాగా మరో చిత్రంతో 14 భాషల్లో అలరించనున్నారు ఈ హీరో. అనూప్‌ భండారి దర్శకత్వంలో కిచ్చా సుదీప్, […]

Written By: Raghava Rao Gara, Updated On : December 9, 2021 5:06 pm
Follow us on

Vikrant Rona: రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు. తర్వాత వచ్చిన బాహుబలి సినిమాలో కూడా ఓ పాత్రలో మెప్పించారు సందీప్. ‌ హిందీ తమిళ తెలుగు అన్ని భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందగా తాజాగా మరో చిత్రంతో 14 భాషల్లో అలరించనున్నారు ఈ హీరో. అనూప్‌ భండారి దర్శకత్వంలో కిచ్చా సుదీప్, నిరూప్‌ భండారి, నీతా అశోక్, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం “విక్రాంత్‌ రోణ”. జాక్‌ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్‌ పాండియన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Vikrant Rona

Also Read: రవితేజ సరదా పాట బాగా వచ్చిందట !

ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. “విక్రాంత్‌ రోణ” అనే టైటిల్ తో మిస్టరీ థ్రిల్లర్‌గా త్రీ డీ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానులకు నచ్చుతుందని. అలానే ప్రపంచానికి సరికొత్త సూపర్‌ హీరోను పరిచయం చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది దాదాపు 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చిత్రబృందం తెలిపారు. అలానే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్‌ ఈ సినిమాపై ప్రేక్షక అభిమానుల లో భారీ అంచనాలు పెంచాయి. ఇదిలా ఉంటే కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో కనిపించనున్నాడట చూడాలి మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరించనుందో చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

Also Read: నా కూతురు రాధ గర్వపడేలా ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నాను: శ్రియా