Ustaad Bhagat Singh: డబుల్ మాస్..’ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిమ్స్ వీడియో డైలాగ్ లీక్.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే!

సరిగ్గా 11 ఏళ్ళ క్రితం 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలై ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టేసింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక మధుర జ్ఞాపకం లాంటిది. అదే రోజున 'మళ్లీ లోడెడ్' అంటూ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం గ్లిమ్స్ మన ముందుకి రాబోతుంది.

Written By: Vicky, Updated On : May 9, 2023 7:48 am
Follow us on

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంది, ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ని రీసెంట్ గానే పూర్తి చేసి,ఈ నెల 11 వ తేదీన గ్లిమ్స్ వీడియో ని కూడా విడుదల చెయ్యబోతున్నారు.

సరిగ్గా 11 ఏళ్ళ క్రితం ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టేసింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక మధుర జ్ఞాపకం లాంటిది. అదే రోజున ‘మళ్లీ లోడెడ్’ అంటూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గ్లిమ్స్ మన ముందుకి రాబోతుంది. ఈ గ్లిమ్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.

ఈ గ్లిమ్స్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నుండి ఎంత మాస్ అయితే ఆశిస్తున్నారో,అంతకు మించి మాస్ గా ఉండేలా ఉండబోతుందట. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఇంటర్వెల్ సన్నివేశం అప్పుడు ‘గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ వీడియో కూడా అదే తరహాలో ఉండబోతుంది అట. ఈ గ్లిమ్స్ లో డైలాగ్స్ తో పాటుగా, అదిరిపొయ్యే యాక్షన్ షాట్స్ కూడా పెట్టినట్టు సమాచారం. ఇదే రేంజ్ మాస్ లో గ్లిమ్స్ వీడియో ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దూకుడు ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ గ్లిమ్స్ తో ఈ చిత్రం రీమేక్ సినిమానా లేదా డైరెక్ట్ సినిమానా అనేది కూడా ఫ్యాన్స్ కి అర్థం అయ్యిపోతాది అట, చూడాలి మరి.