Seenu Movie Heroine: వెంకటేష్ ‘శీను’ మూవీ హీరోయిన్ ఒక బడా సూపర్ స్టార్ కి భార్య అనే విషయం ఎవరికైనా తెలుసా..!

వెంకటేష్ మూగవాడు కదా అని హీరోయిన్ జాలి చూపిస్తుంది, అతనిని ప్రేమిస్తుంది.కానీ చివర్లో వెంకటేష్ కి తనని అంతలా ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ముందు నిజాయితీగా లేను అనే బాధతో తన నాలుకని నిజంగానే కోసుకొని మూగవాడు అవుతాడు.

Written By: Vicky, Updated On : May 9, 2023 7:56 am

Seenu Movie Heroine

Follow us on

Seenu Movie Heroine: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కల్ట్ క్లాసిక్స్ ఉన్నాయి, కొన్ని సినిమాలు అద్భుతంగా ఉన్నప్పటికీ మన కమర్షియల్ విలువలకు దూరంగా ఉండడం వల్ల ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సినిమాలలో ఒకటి ‘శీను’, ఈ చిత్రం లో వెంకటేష్ పల్లెటూరి బైతు పాత్రలో కనిపిస్తాడు. ఒక పల్లెటూరి నుండి వచ్చిన కుర్రాడు, పోష్ గా ఉండే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, అనుకోని కొన్ని సంఘటనల వల్ల వెంకటేష్ ఆ అమ్మాయి ముందు మూగవాడిలాగా నటించాల్సి వస్తుంది.

వెంకటేష్ మూగవాడు కదా అని హీరోయిన్ జాలి చూపిస్తుంది, అతనిని ప్రేమిస్తుంది.కానీ చివర్లో వెంకటేష్ కి తనని అంతలా ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ముందు నిజాయితీగా లేను అనే బాధతో తన నాలుకని నిజంగానే కోసుకొని మూగవాడు అవుతాడు. ఇదే ఈ సినిమాకి క్లైమాక్స్, ఈ క్లైమాక్స్ ని ఆడియన్స్ అప్పట్లో తీసుకోలేకపోయారు, ఫలితంగా ఫ్లాప్ అయ్యింది.

Twinkle Khanna

అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ట్విన్కిల్ ఖన్నా అప్పట్లో అందరికీ తెగ నచ్చేసింది. ఎవరు ఈ అమ్మాయి ఇంత అందం గా ఉంది అనుకునే వారు. కచ్చితంగా బాలీవుడ్ నుండి వచ్చిన హీరోయిన్ అని మాత్రం తెలుసు కానీ, ఆమె ఎవరు ఏమిటి అనే బ్యాక్ గ్రౌండ్ మాత్రం ఎవరికీ తెలియదు. అయితే సోషల్ మీడియా లో ట్విన్కిల్ ఖన్నా ఎవరు అని వెతికితే ఈమె బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ మొత్తం తెలిసింది. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా కి కూతురు, ఈమె తల్లి డింపుల్ కపాడియా కూడా అప్పట్లో పెద్ద స్టార్ హీరోయిన్. ఇక ఈమె భర్త మరెవరో కాదు, బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీడింగ్ స్టార్స్ లో ఒకడిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్.

‘ఇంటర్నేషనల్ ఖిలాడీ’ అనే సినిమాలో హీరోహీరోయిన్లు గా నటించిన ఈ జంట ప్రేమించుకొని 2001 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఆరవ్ కుమార్ మరియు నితారా కుమార్ అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అక్షయ్ కుమార్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ట్విన్కిల్ కపాడియా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈమె తెలుగు మరియు హిందీ లో కలిపి కేవలం 17 సినిమాల్లో మాత్రమే నటించింది.