Ustaad Bhagat Singh viral dance scenes: ఈమధ్య కాలం లో కమర్షియల్ సినిమాలు బాగా తగ్గిపోయాయి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు బాగా పెరిగిపోవడం వల్ల, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిస్ అయిపోతున్నాం. వాటిల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రిఫరెన్స్ సన్నివేశాలు ఒకటి. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎదో ఒక చిన్న రిఫరెన్స్ ఉండేది. స్టార్ హీరోలు సైతం ఆయన రిఫరెన్స్ లు వాడేసేవారు. అలాంటి పవర్ స్టార్ ఎప్పుడైనా ఇతర హీరోల పాటలకు డ్యాన్స్ వేయడం చూసారా ?, కనీసం ఈ దృశ్యాన్ని కలలో అయినా ఊహించుకొని ఉంటారా ..? , అలాంటి వాళ్లంతా మరి కొద్దిగంటల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) లో ఈ అరుదైన దృశ్యాలను చూడబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంటుందట. అందులో పవన్ కళ్యాణ్ ఇతర హీరోల పాటలకు స్టెప్పులు వేస్తాడట.
ఈ సీక్వెన్స్ మొత్తం వేరే లెవెల్ లో వచ్చిందని , ఆడియన్స్ థియేటర్స్ లో మెంటలెక్కిపోతారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం మెగా హీరోల పాటలకు స్టెప్పులు వేస్తాడా ?, లేకపోతే బయట హీరోల పాటలకు కూడా స్టెప్పులు వేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. కొంతమంది అయితే తన తోటి స్టార్ హీరోల పాటలకు పవన్ కళ్యాణ్ చిందులు వేస్తాడని, అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి పాట కూడా ఉంటుందని అంటున్నారు. మరికొంతమంది అయితే అవన్నీ పూర్తిగా అబద్దం , ఆయన ఈ సినిమాలో కేవలం చిరంజీవి పాటలకు మాత్రమే డ్యాన్స్ వేసాడని అంటున్నారు. చిరంజీవి పాటలకు , లేదా సీనియర్ హీరోల పాటలకు స్టెప్పులేస్తే పర్వాలేదు కానీ, పవన్ కళ్యాణ్ తో సరిసమానమైన ఇమేజ్ ఉన్న మహేష్ బాబు, ఎన్టీఆర్ , ప్రభాస్ వంటి హీరోల పాటలకు డ్యాన్స్ వేస్తే అసలు ఊరుకోమని , ఇంటికి వచ్చి మరీ కొడుతాం అంటూ పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో బెదిరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి ?, ఆయన తో ఇలాంటి సన్నివేశాలు తీయడం ఏంటి ?, ఏదైనా తేడా జరగాలి , నీకు మామూలుగా ఉండదు అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ని హెచ్చరిస్తున్నారు. మరి డైరెక్టర్ హరీష్ శంకర్ ఎలా ప్లాన్ చేసాడో చూడాలి మరి. ఈ సినిమా తలరాతని మార్చే సన్నివేశం అవ్వొచ్చు, అది పాజిటివ్ గా అయినా కావొచ్చు, నెగటివ్ గా అయినా కావొచ్చు. పాజిటివ్ గా అయితే మరో గబ్బర్ సింగ్ రిపీట్ అవుతుంది. ఒకవేళ నెగటివ్ అయితే మాత్రం మరో సర్దార్ గబ్బర్ సింగ్ అవుతుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
