OG Video Pawan Kalyan : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల ఆశలన్నీ ప్రస్తుతం ఓజీ(They Call Him OG) చిత్రం పైనే ఉన్నాయనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నడుస్తున్న పాన్ ఇండియన్ ట్రెండ్ లో ఈ రీమేక్ సినిమాలు నడవడం చాలా కష్టమైపోయింది. అందరి హీరోలు పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లి సినిమాలు తీస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రీమేక్ సినిమాలతో నెట్టుకొస్తున్నాడు అని ఆయన అభిమానులు చాలా బాధపడ్డారు. అలాంటి సమయంలో ఓజీ చిత్రం ప్రకటన వచ్చింది. నేటి తరం యువత పిచ్చెక్కిపోయే జానర్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తుండడంతో కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు. అలా ఈ చిత్రం మొదలైంది.
Also Read : వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే: పవన్ కళ్యాణ్
కానీ మధ్యలో పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడంతో తాత్కాలికంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. మళ్ళీ ఇప్పట్లో ఈ సినిమా మొదలు అవుతుందా అని అనుకుంటున్న సమయంలో రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి బ్యాలన్స్ ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ముందుగా హరి హర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసాడు, ఇప్పుడు ఓజీ చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే హైదరాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు ముంబై కి షిఫ్ట్ అయ్యింది. ముంబై లో గత రెండు మూడు రోజుల నుండి జరుగుతున్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు. అయితే షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.
పాత కాలం లో బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకొని తిరిగేవాళ్లు మన కుర్రాళ్ళు. అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ని పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో ఉపయోగిస్తున్నాడు. వీటికి సంబంధించిన లుక్స్ మూవీ టీం అధికారికంగా రిలీజ్ చేసిన తర్వాత ఆ స్టైల్ ని యూత్ ఆడియన్స్ విపరీతంగా అనుసరించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన మరో చిత్రం ‘హరి హర వీరమల్లు’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదల కాబోతున్న మొట్టమొదటి సినిమా ఇది. బడ్జెట్ కూడా భారీ రేంజ్ లో ఖర్చు చేశారు. చూడాలి మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.
#viralvideo#Mumbai లో #OG షూటింగ్#OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటోంది.
వింటేజ్ బెల్ బాటమ్ పాయింట్ ధరించిన ఆయన లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. pic.twitter.com/e3PjZBppfB
— greatandhra (@greatandhranews) May 28, 2025