Pawan Kalyan: ప్రస్తుతం స్టార్ హీరోలందరు సినిమా సినిమాకి మధ్య వేరియేషన్స్ ను చూపిస్తూ డిఫరెంట్ డైరెక్టర్లతో వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందిస్తున్నాడు. రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. తొందర్లోనే ఈ సినిమాని సైతం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా మీద కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు బ్యానర్లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేశాడు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ డేట్స్ అయితే ఇచ్చాడట. మరొక సినిమా చేద్దామని చెప్పినట్టుగా అప్పట్లో దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సోషల్ మెసేజ్ ని ఇచ్చే సినిమా చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నలైతే రాలేదు.
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. నీకు దండం పెడతాం పవనన్న ఇక మీదట నువ్వు సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాత్రం సినిమాలు చేయకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ క్రింజ్ కామెడీతో ఉన్నాయని ఆయనతో సినిమా చేస్తే అది పెద్దగా వర్కౌట్ కాదని చెబుతున్నారు. ఇక అనిల్ కి అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ తో కూడా అలాంటి రొటీన్ కామెడీ చేయిస్తాడు. దాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరని చెప్తున్నారు. ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో కథలు పెద్ద ఎఫెక్ట్ గా ఏమీ ఉండవని నాలుగు జోకులు, రెండు ఫైట్లు, కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సినిమాను లాగిస్తాడని చెబుతున్నారు.
ఆయన సినిమాల్లో చేయడం కంటే ఖాళీగా ఉన్నది బెటర్ అని పవన్ కళ్యాణ్ కు సలహాలైతే ఇస్తున్నారు… ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నాడు’ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…