Pawan Kalyan : యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటు మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఒకరు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆయన సాధించిన సక్సెస్ లతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకానొక సందర్భంలో అతనికి వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికి అతని అభిమానులు మాత్రం ఆయన సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన చెబుతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన సినిమా సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమాకు సంబంధించిన పనులను డైరెక్టర్ త్రివిక్రమ్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కారణమేంటి అంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన సినిమాకు సంబంధించిన విషయాలను పట్టించుకునేంత తీరిక ఉండడం లేదు.
దాని వలన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజుల్లో సినిమాలను చేయగలిగేటువంటి కథలను ఎంచుకొని అతని చేత సినిమాలు చేయించి సూపర్ సక్సెస్ సాధించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు… ఇది పవన్ కళ్యాణ్ వరకు బాగానే ఉన్నప్పటికి ఆయా సినిమాలు చేస్తున్న దర్శకులను మాత్రం చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అంటూ కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.
కారణం ఏంటి అంటే వాళ్ళు ఒక విజన్ లో సినిమాని చేయాలనుకుంటారు అలా కాదని పవన్ కళ్యాణ్ డేట్స్ కు తగ్గట్టుగా త్రివిక్రమ్ ఆ సినిమాలోని సీన్స్ చేస్తూ ఉండటం వల్ల వాళ్లు పూర్తిస్థాయిలో వాళ్ల క్రియేటివ్ లెవెల్స్ ని వాడుకోలేకపోతున్నారని ఒక చిన్న ఇబ్బంది దర్శకులందరికి కలుగుతోంది.
ఇక ఇలాంటి సందర్భంలో ఎందుకు అని త్రివిక్రమ్ అంతగా ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పే దర్శకులు సైతం ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకుని అన్నింటిని సమానంగా కలుపుకుని ముందుకు వెళ్లగలిగే కెపాసిటి ఉన్నవాళ్లు మాత్రమే అతనితో సినిమా చేస్తే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…