Pawan Kalyan : యుక్తవయసులోనే పవన్ కళ్యాణ్ ముక్తిమార్గం.. ‘అజ్ఞాతవాసం’లో ఏం చేశాడంటే?

ముక్తి మార్గం కోసం యుక్తవయసులోనే ధ్యాన మార్గం పొందారు. అయితే ఇది కొద్దిమంది సన్నిహితులకే తెలుసు. తిరుపతిలోని యోగిని రాజేశ్వరి వద్ద ధ్యానమార్గంను స్వీకరించారు. పవన్ తో రామ్ లాల్ ప్రభుజీ దీక్షను ఆచరింప చేశారు.

Written By: NARESH, Updated On : June 12, 2023 5:25 pm
Follow us on

Pawan Kalyan : పవన్ చేపట్టిన ధర్మ యాగం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో యాగం చేపట్టారు. రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ స్వయంగా ప్రారంభించారు. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగాన్ని చేపట్టినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ సంప్రదాయ వస్త్రధారణలో యాగ ప్రాంగణంలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఎటువంటి హంగూ ఆర్భాటాలకు తావులేకుండా యాగాన్ని జరిపిస్తున్నారు. సువిశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. మంగళవారం కూడా యాత్ర కొనసాగనుంది. బుధవారం నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.

అయితే పవన్ లో ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. ప్రజా సంకల్పానికి దైవ సంకల్పం తోడైతే అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే యాగం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ముక్తి మార్గం కోసం యుక్తవయసులోనే ధ్యాన మార్గం పొందారు. అయితే ఇది కొద్దిమంది సన్నిహితులకే తెలుసు. తాజా యాగంతో పవన్ యుక్తవయసులో స్వీకరించిన ధ్యానమార్గం చర్చకు వస్తోంది.తిరుపతిలోని యోగిని రాజేశ్వరి వద్ద ధ్యానమార్గంను స్వీకరించారు. పవన్ తో రామ్ లాల్ ప్రభుజీ దీక్షను ఆచరింప చేశారు. ఆ సమయంలోనే శక్తి పాతాన్ని ఆమె ప్రసాదించారు. రామ్ లాల్ ప్రభుజీ, బడే బాబా చిత్రాలతో పాటు తన తండ్రి కొణిదల వెంకట్రావు చిత్రపటాన్ని తాజా యాగపీఠంపై నిలిపారు. ఆ ముగ్గురి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు ప్రారంభించారు.

తన తండ్రి గురువు స్థానంలో ఉండి తనను నడిపించిన విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తనలో ధర్మం, సామాజిక చైతన్యం రగిల్చిన మొదటి వ్యక్తి తన తండ్రేనని సగర్వంగా చెప్పుకున్నారు. సనాతన ధర్మంతో పాటు అన్ని మతాల సారాన్ని ప్రాథమిక స్థాయి నుంచి చెబుతూ ఉండేవారని గుర్తుచేశారు. అందువల్ల ఆయనను గురువు స్థానంలో నిలుపుకున్నానని భక్తి పూర్వకంగా పవన్ తెలిపారు.