Pawan Kalyan and Suriya : సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) తర్వాత అత్యధిక మార్కెట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఒకప్పుడు సూర్య(Suriya Sivakumar) క్రేజ్ ఎలా ఉండేదంటే, ఈయనకు ఇంకో రెండు హిట్లు పడితే కచ్చితంగా రజినీకాంత్ రేంజ్ ని దాటేస్తాడు అని అనుకునేవారు. అలా ఎన్ని లక్షల మంది దిష్టి ఆయనకు తగిలిందో ఏమో తెలియదు కానీ, అలా ట్రేడ్ అనుకున్న రోజు నుండే సూర్య డౌన్ ఫాల్ మొదలైంది. వరుసగా ఫ్లాప్ సినిమాలు తీస్తూ అభిమానులను నిరాశపరిచాడు. ఇటీవల కాలం లో అయితే ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు కూడా నేడు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ సూర్య మాత్రం ఇంకా వంద కోట్ల మార్కెట్ దగ్గరే ఆగిపోయాడు. గత ఏడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘కంగువా’ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఇప్పుడు ఆయన అభిమానులంతా కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ‘రెట్రో'(Retro Movie) చిత్రం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ గ్యాప్ లో సూర్య మరో ప్రాజెక్ట్ ని కూడా సెట్ చేసాడు. గతం లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అమ్మోరు తల్లి’ అనే సూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీ తో సూర్య ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘గోపాల గోపాల’ సినిమాకి చాలా దగ్గర పోలికతో ఉంటుందని సమాచారం. ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే, కొన్ని అనుకోని సంఘటనల వల్ల భూమి మీదకు వచ్చిన దేవుడికి ఒక అన్యాయం జరుగుతుంది. ఆ దేవుడి తరుపున న్యాయవాదిగా హీరో పాత్ర ఉంటుంది. దేవుడికి ఎలా న్యాయం చేసాడు, ఆ న్యాయం కారణంగా దేవుడికి ఒక్కటే లాభం చేకూరుతుందా?, లేదా కోట్లాది మంది ప్రజలకు లాభం చేకూరుతుందా అనేది స్టోరీ.
ఇందులో భక్తుడిగా, దేవుడిగా సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దేవుడు, న్యాయవాది, కోర్టు అనగానే మనకి ‘గోపాల..గోపాల’ మూవీ స్టోరీ గుర్తుకొస్తుంది. ఈ సినిమా హిందీ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఓ మై గాడ్’ చిత్రానికి రీమేక్. అదే తరహా సినిమాని సూర్య ఇప్పుడు చేయబోతున్నాడు. కానీ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకు ముందు ఇదే లైన్ మీద సినిమాలు వచ్చినప్పటికీ నేపథ్యం, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటే ఇలాంటి సబ్జక్ట్స్ బాక్స్ ఆఫీస్ వద్ద బాంబులు లాగా పేలుతాయి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ నెల నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా తర్వాత సూర్య తెలుగు లో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read : పవన్ కళ్యాణ్ OG సినిమా పోస్టర్ ని చూపించి భారీ స్కామ్.. రూ.1.34 కోట్లు కొట్టేశారు!