Pawan Kalyan: ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు గాని ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు గాని ఆయనని చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. నిజానికి ఆయనంటే ప్రేక్షకులకు అభిమానం కంటే కూడా ఎక్కువ దాన్ని చెప్పాలంటే ఇంకేదైనా కొత్త వాడాలి. నిజానికి పవన్ కళ్యాణ్ ని తన అభిమానులు హీరోగానే కాకుండా ఒక దేవుడిగా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకుల్లో ఎందుకు అంత క్రేజ్ ఉందో ఎవరు చెప్పలేరు.
ఇక అలాంటి పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడానికి తనకి మొదట్లో అంత ఇష్టం లేకపోయిన కూడా వాళ్ల అన్నయ్య చిరంజీవి ఫోర్సు వల్ల వచ్చాడు. అయినప్పటికీ వాళ్ళ అన్నయ్య పేరు ఎక్కడ చెడిపోకూడదు అనే ఉద్దేశ్యం తోనే ఆయన ఇక్కడ స్టార్ హీరోగా ఎదగాలనుకున్నాడు. అందుకే దానికోసం చాలా వరకు కష్టపడ్డాడు అందులో ఆయనకు చాలా మంచి సక్సెస్ లు కూడా వచ్చాయి ఇక దాంతో పాటు గా పవర్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చింది. ఇక ఇది ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఒక డైరెక్టర్ తో సినిమా చేయాలి అని అనుకున్నడు కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు ఆ డైరెక్టర్ ఎవరంటే శ్రీను వైట్ల…
ఆయన చిరంజీవి తో అందరివాడు సినిమా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టలెక్కలేదు రలేకపోతే పవన్ కళ్యాణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేసేవాడు.ఇక పవన్ కళ్యాణ్ తో మిస్ అయ్యక శ్రీను వైట్ల వరుసగా నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా వరుసగా త్రివిక్రమ్, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ రావడంతో తనకి కూడా ఆ తర్వాత వీలు కాలేదు.
అలా వీళ్ళ కాంబినేషన్ అనేది సెట్ అయినట్టే అనిపించినప్పటికీ మధ్యలోనే బ్రేక్ అయిపోయింది. లేకపోతే శ్రీను వైట్ల పవన్ కళ్యాణ్ తో కూడా కామెడీ చేయించి ఒక మంచి సక్సెస్ అందుకునేవాడేమో…