
పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్ లో షూటింగ్ ని పూర్తి చేస్తున్న చిత్రం #PKSDT..సముద్రఖని దర్శకత్వం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యింది.ఈ నెల 23 వ తారీఖుతో పవన్ కళ్యాణ్ పార్ట్ కి సంబంధించిన వర్క్ మొత్తం అయిపోతుంది.
మార్చి 22 వ తారీఖున ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని మూవీ టీం అధికారికంగా విడుదల చెయ్యబోతున్నారు.జులై లేదా ఆగస్టు కి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఉన్న ఒక సన్నివేశానికి సంబంధించిన ఫోటో లీక్ అయిపోయింది.
ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.ఇదే కదా మేము ఆయన నుండి కోరుకునేది,ఆయన మార్కు హీరోయిజం బలంగానే ఉండేట్టు ఉందని అభిమానులు ఈ చిత్రం పై అంచనాలు పెంచేసుకుంటున్నారు.ఇది కేవలం లీక్ అయినా ఫోటో మాత్రమే, అసలు సిసలు ఫస్ట్ లుక్ వచ్చిన రోజు అభిమానులు పూనకాలతో ఊగిపోతారని, ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే సినిమా అవుతుందని ఫిలిం నగర్ లో ఒక టాక్ గట్టిగా వినిపిస్తుంది.
అయితే ఫస్ట్ లుక్ విడుదలకు ముందే ఈ లీక్స్ ని చూసి అభిమానులు భయపడుతున్నారు.ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహం మొత్తం ఇలా లీక్ ఫోటోల ద్వారా సంపేస్తున్నారని, దయచేసి మరోసారి ఇలా లీక్స్ రాకుండా చూసుకోమంటూ ఫ్యాన్స్ మూవీ మేకర్స్ ని ట్యాగ్ చేసి చెప్తున్నారు.రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని క్రేజీ అప్డేట్లు రానున్నాయి.