Pawan Kalyan In Jailer 2 Cameo Role: గత కొంత కాలంగా ‘జైలర్’ చిత్రం లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒక స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తాన్ని ఈ వార్తలు ఒక రేంజ్ లో ఊపేశాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని షారుఖ్ ఖాన్ పీఆర్ టీం అధికారికంగా ప్రకటన చేయడంతో , ఈ అంశం పై చర్చలు ఆగాయి. అయితే నేడు మరో సరికొత్త చర్చకు సోషల్ మీడియా లో తెరలేపారు. తమిళనాడు కి చెందిన ఒక ప్రముఖ వార్త పత్రిక, ‘జైలర్ 2’ చిత్రం లో షారుఖ్ ఖాన్ పోషించాల్సిన పాత్రను , పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడని, రీసెంట్ గానే ఆ చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పవన్ కళ్యాణ్ ని కలిసి రిక్వెస్ట్ చేయగా, ఆయన వైపు నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.
అయితే అభిమానులు మాత్రం ఈ వార్తని అసలు నమ్మడం లేదు. పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్ లో తానూ కమిట్ అయిన సినిమాలకే డేట్స్ ని కేటాయించడం అతి కష్టం గా మారింది. అలాంటిది పక్క హీరో సినిమాలో క్యామియో రోల్ ఎలా చేస్తాడు , ఇది కావాలని వ్యూస్ కోసం క్రియేట్ చేసిన వార్త మాత్రమే , ఇందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు ఫ్యాన్స్. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో నిజంగా నటిస్తే , బాక్స్ ఆఫీస్ ఊచకోత మామూలు రేంజ్ లో ఉండదని, తమిళ సూపర్ స్టార్ పక్కన, తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు దేవుడిలాగా కొలిచే పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తోడు అయితే , ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు.
నెల్సన్ దర్శకత్వం లో , అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే, థియేటర్స్ లో అభిమానులు ఏమైపోతారో అంటూ సోషల్ మీడియా లో కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రాక్టీకల్ గా ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం దాదాపుగా అసాధ్యమే అయినప్పటికీ, ఒకవేళ రజినీకాంత్ స్వయంగా పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తే , ఆయన కాదు అనలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇది జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు