Kingdom movie pre-release business: మరో రెండు రోజుల్లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు కారణం గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ అవ్వడమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుకోవడం తో ఈ చిత్రం పై ఒక స్టార్ హీరో సినిమాకు ఎలాంటి అంచనాలు ఉంటాయో, అలాంటి అంచనాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో అదిరిపోయాయి. సినిమాకు ఉన్న హైప్ కి తగ్గట్టు కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్లి చేరుతుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఇంతటి నెగిటివ్ టాక్ లో ఈ రేంజ్ వసూళ్లా..? ‘హరి హర వీరమల్లు’ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్!
వరుసగా ఇన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ సినిమాకు ఇంత బిజినెస్ జరిగిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్ దేవరకొండ కి మొదటి సినిమా నుండి నైజాం ప్రాంతం లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ చిత్రం నైజాం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగిందని అంటున్నారు. మీడియం రేంజ్ హీరోలలో ఇది ఆల్ టైం రికార్డు బిజినెస్ అట. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి, కోస్తాంధ్ర ప్రాంతం లో మరో 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 36 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 54 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.
Also Read: అమెజాన్ ప్రైమ్’ మరియు ‘నెట్ ఫ్లిక్స్’ మధ్య నలిగిపోతున్న ‘అఖండ 2’
ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపుగా 130 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశామని ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ, సాటిలైట్ , హిందీ దుబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్, ఇలా అన్ని కలిపి ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయలకు పైగానే బిజినెస్ జరిగిందని, ఇది మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆల్ టైం రికార్డు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే జరిగిన 54 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని కేవలం వీకెండ్ తోనే రీకవర్ చేయొచ్చు. కానీ ఆ రేంజ్ టాక్ వస్తుందో లేదో చూడాలి.