Pawan Kalyan : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సుమారుగా మూడేళ్ళ పాటు ఈ చిత్రానికి డేట్స్ ని కేటాయించి తన పీక్ పీరియడ్ ని వృధా చేసినందుకు గానూ అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. గతంలో కూడా రామ్ చరణ్ కెరీర్ లో ఫ్లాప్స్, డిజాస్టర్స్ ఉన్నాయి, కానీ ‘గేమ్ చేంజర్’ కొట్టిన దెబ్బ నుండి మాత్రం వాళ్ళు ఇప్పట్లో కోలుకోలేరేమో అని అనుకుంటున్న సమయంలో ‘పెద్ది’ మూవీ గ్లింప్స్ వీడియో వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా పై రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Also Read : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!
ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్(Sukumar) తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’ లాంటి కల్ట్ క్లాసిక్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై కూడా అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ‘పుష్ప 2’ తర్వాత విదేశాల్లో పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకుంటున్న సుకుమార్, జూన్ నెల నుండి ఈ సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చోబోతున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ కి నాలుగు తరహా స్టోరీ లైన్స్ ని వినిపించాడట. అందులో ఒకటి లాక్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లడం దాదాపుగా అసాధ్యమే, కనీసం పూజా కార్యక్రమాలు కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది.
స్టోరీ డెవలప్మెంట్, స్క్రిప్ట్ రైటింగ్ కి ఈ ఏడాది సమయం సరిపోతుంది. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కేవలం రెండు మూడు నెలల్లో మొదలు పెట్టొచ్చు. కానీ వచ్చే ఏడాది చివరి వరకు ఎందుకు ఆగాలి అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అని తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కథని వినిపించాడట. చాలా బాగుందే, కానీ ఇది నాకంటే మన చరణ్ కి బాగా సూట్ అవుతుంది, అతనితో చెయ్యి నేను మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ అన్నాడట. చెప్పినట్టుగానే రామ్ చరణ్ తో మాట్లాడి, అతనిపై ఒత్తిడి తెచ్చి ‘పెద్ది’ తర్వాత వెంటనే ఈ ప్రాజెక్ట్ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడట. బాబాయ్ ఆదేశించిన తర్వాత రామ్ చరణ్ చేయకుండా ఎలా ఉంటాడు, వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అంటే #RC17 సుకుమార్ తో కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉండబోతుంది అన్నమాట.
Also Read : నేటి నుండి ఓజీ షూటింగ్ ప్రారంభం..పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే!