Pawan Kalyan – Superstar Rajinikanth : మరో 9 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా ని తెరకెక్కించడానికి పాపం నిర్మాత AM రత్నం పడిన కష్టాలు సాధారణమైనవి కావు. రెగ్యులర్ నిర్మాతలకు అయితే ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైనా తట్టుకోగలరు. కానీ AM రత్నం రెగ్యులర్ నిర్మాత కాదు. ఒకప్పుడు ఆయన ఇండియా ని షేక్ చేసే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో నిర్మించాడు. కానీ ఇప్పుడు ఆ ఫామ్ పోయింది. ఏ ముహూర్తం లో ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మొదలు పెట్టాడో తెలియదు కానీ, అడుగడుగునా అడ్డంకులే. వేరే ఏ నిర్మాత అయినా సినిమాని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయేవాడు. కానీ AM రత్నం మొండివాడు. పట్టుదలతో ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. అభిమానులను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 8 వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి లో గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే ఈ సినిమా మీద హైప్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సొంత అన్నయ్య రావడం కొత్తేమి కాదు, కానీ రజనీకాంత్ రావడం మాత్రం ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయితే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందేనా..?
చిరంజీవి తో రజనీకాంత్ కి దశాబ్దాల నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. అదే విధంగా రజనీకాంత్ తో నిర్మాత AM రత్నం కి కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తో పెద్దగా పరిచయం లేదు. అయినప్పటికీ ఆయన ఈ ఈవెంట్ కి చిరంజీవి,AM రత్నం కారణంగా వస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు చిరంజీవి, రజనీకాంత్ ఒకే స్టేజి మీద కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. రజనీకాంత్ నోటి నుండి పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి మాటలు రాబోతున్నాయి అనే ఆత్రుత అభిమానుల్లో ఉంది. కచ్చితంగా రజనీకాంత్ రావడం వల్ల తమిళనాడు లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రీచ్ వస్తుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ లాంచ్ కూడా చేయబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.