spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Pre Release Event Trivikram: పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్...

Ustaad Bhagat Singh Pre Release Event Trivikram: పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఈమధ్య త్రివిక్రమ్ రాకపోవడానికి కారణం ఇదా?

Ustaad Bhagat Singh Pre Release Event Trivikram: టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి అత్యంత సన్నిహితుల లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas). జల్సా సినిమాతో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం కాస్త స్నేహం గా మారి, సొంత అన్నదమ్ములు లాగా మారిపోయేలా చేసింది. త్రివిక్రమ్ మన టాలీవుడ్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన కోరుకుంటే ప్రతీ సూపర్ స్టార్ తో కలిసి సినిమా చేయగలడు. అంతటి స్టేటస్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నాడు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓకే చేసినవే. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చివరి చిత్రం ‘అజ్ఞాతవాసి’. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.

బ్రో, భీమ్లా నాయక్ చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే , మాటలు అందించాడు కానీ , ఆయన డైరెక్షన్ లో మాత్రం మరో సినిమా ఇప్పటి వరకు రాలేదు. సినిమా రాకపోయినా పర్వాలేదు. కనీసం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా రావడం లేదు. నిన్న జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా రావాలి. పవన్ కళ్యాణ్ పక్కనే ఆయన సీటుని కూడా ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆయన డుమ్మా కొట్టాడు. పవన్ కళ్యాణ్ గురించి గతం లో త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు ఒక సెన్సేషన్. ఆ ప్రసంగాలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఇప్పటికీ కూడా అభిమానులు ఆ ప్రసంగాలను బోర్ కొట్టినప్పుడల్లా చూస్తుంటారు. అలాంటి ప్రసంగం నిన్న మరోసారి వినే అవకాశం దక్కింది, సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఎందుకని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరు కావడం లేదు?, అసలు సమస్య ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ‘భీమ్లా నాయక్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చాడు, కానీ స్టేజి మీదకు వచ్చి మాట్లాడడం జరగలేదు. ఎందుకు అంతలా ఆయన అభిమానుల నుండి దాక్కుంటున్నాడో అర్థం కావడం లేదని అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇష్టమైన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే, ఈమధ్య కాలం లో వాళ్లకు కలిసి రావడం లేదట, అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడం లేదని తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version