Pawan Kalyan : ఒకప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాక్ తో సంబంధం లేకుండా, కాంబినేషన్ తో సంబంధం లేకుండా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ పెట్టే ఇద్దరు ముగ్గురు టాలీవుడ్ హీరోలలో ఒకడు ఆయన. అయితే ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ తన రేంజ్ కి తగ్గ ఓపెనింగ్స్ ని అందుకోలేకపోయాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి ఎలాంటి సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు కానీ, గత ఐదేళ్లు మాజీ సీఎం జగన్ కారణంగా పవన్ కళ్యాణ్ ఓపెనింగ్స్ స్టామినా పై చాలా గట్టి ఎఫెక్ట్ తగిలింది. వకీల్ సాబ్ సినిమా నుండి ఇది మొదలైంది. వకీల్ సాబ్ సినిమా సమయంలో అర్థ రాత్రి జీవోలను విడుదల చేసి బెనిఫిట్ షోస్ ని, టికెట్ రేట్స్ ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read : సరికొత్త పోస్టర్ తో ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్!
బెనిఫిట్ షోస్ ని అయితే రద్దు చేయగలిగారు కానీ, మూవీ టీం హై కోర్టు కి వెళ్లడం వల్ల మొదటి మూడు రోజులు టికెట్ హైక్స్ ని కొనసాగించారు. బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ ప్రభుత్వం అనుమతుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అవి ఆ సినిమాకు రద్దు చేసారు. కేవలం రెగ్యులర్ షోస్ మీద మొదటి రోజు ఈ చిత్రానికి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆ రోజుల్లో ఆల్ టైం టాప్ 4 రికార్డు అని అనొచ్చు. ఇక ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘భీమ్లా నాయక్’ చిత్రానికి బెనిఫిట్ షోస్ లేవు, స్పెషల్ షోస్ లేవు, టికెట్ హైక్స్ కూడా లేవు. నైజాం లో మొదటి రోజు ఆల్ టైం రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం, టికెట్ రేట్స్ లేని కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో దారుణమైన ఓపెనింగ్ వసూళ్లను చూడాల్సి వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా, కేవలం 26 కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం మూడు రోజుల్లో వంద కోట్ల షేర్ ని రాబట్టాల్సిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 95 కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బ్రో చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరోకు భారీ ఓపెనింగ్ వసూళ్లను చూసి 7 ఏళ్ళు అయ్యింది. జూన్ 12 న విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రానికి ఒక సినిమాకు మొదటి రోజు ఆల్ టైం రికార్డుని నెలకొల్పడానికి ఏవేవి కావాలో, అవన్నీ ఉన్నాయి. బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్, టికెట్ హైక్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టామినా కి అసలైన పరీక్ష. ప్రభాస్(Rebel Star Prabhas), ఎన్టీఆర్(Junior NTR), అల్లు అర్జున్(Icon star Allu Arjun) లాగానే పవన్ కళ్యాణ్ కూడా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తాడా లేదా అనేది మరో 20 రోజుల్లో తేలనుంది.