Robin Hood movie : థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన కొన్ని చిత్రాలు టీవీ టెలికాస్ట్ అప్పుడు, ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడం ఈమధ్య కాలంలో మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాము. అసలు ఈ సినిమాని అంత పెద్ద ఫ్లాప్ ఎలా చేశారురా అంటూ సోషల్ మీడియా లో మన అభిప్రాయాలను చెప్తూ ఉంటాము. రీసెంట్ గా జీ5 యాప్ లో స్ట్రీమింగ్ మొదలు పెట్టుకున్న నితిన్(Nithin) ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) చిత్రం కూడా ఆ కోవకే చెందబోతుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. థియేటర్స్ లో ఈ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా సొంతం చేసుకోలేకపోయింది ఈ చిత్రం. అలాంటి డిజాస్టర్ కి ఓటీటీ లో రెండు రోజుల్లో వచ్చిన వ్యూస్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Also Read : పవన్ కళ్యాణ్ స్టామినా కి అసలైన పరీక్ష ‘హరి హర వీరమల్లు’..సక్సెస్ అవ్వగలదా?
జీ5 సంస్థ అందించిన గణాంకాల ప్రకారం, ఈ చిత్రానికి మొదటి 6 రోజుల్లోనే 50 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయట. మే 10న ఈ చిత్రం కేవలం తెలుగు భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మాములుగా హిందీ వెర్షన్ కి ఓటీటీ లో ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. కానీ కేవలం ఒక్క తెలుగు భాష నుండే ఇంతటి రెస్పాన్స్ వచ్చిందంటే చిన్న విషయం కాదు కదా. ఇది సినిమా నచ్చడం వల్ల వచ్చిన వ్యూసా?, లేకపోతే థియేటర్స్ లో ఎలాగో చూడలేదు కదా, కనీసం ఇక్కడైనా చూద్దామని ఒక చూస్తే వచ్చిన వ్యూసా అనేది ఈ చిత్రం ఎన్ని రోజులు టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది అనే దానిని బట్టి తెలుస్తుంది. మొదటి రెండు రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా 30 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఎంతైనా భీష్మ కాంబినేషన్ నుండి వచ్చిన సినిమా. ‘భీష్మ’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వెంకీ కుడుముల ఈ చిత్రం తో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. డిజాస్టర్ టాక్ రావడం వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి కదిలి ఉండకపోయి ఉండొచ్చు. కానీ వెంకీ కుడుముల ఎక్కడ మిస్టేక్ చేశాడు అనే దానికోసమేనా ఒకసారి చూస్తారు కదా, అందుకే ఈ చిత్రం మొదటి వారం లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఫుల్ రన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రం తర్వాత నితిన్ ‘తమ్ముడు’ అనే చిత్రం చేశాడు. దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. జులై 4 న విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కోసం జులై 23 కి వాయిదా వేశారు.