Homeఎంటర్టైన్మెంట్Panjaa Movie Re Release: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి డిజాస్టర్ మూవీ రీ రిలీజ్.....

Panjaa Movie Re Release: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి డిజాస్టర్ మూవీ రీ రిలీజ్.. వర్కౌట్ అవుతుందా?

Panjaa Movie Re Release: ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ వాతావరణం వచ్చింది అనే రేంజ్ ని తలపిస్తారు పవన్ వీరాభిమానులు. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవా కార్యక్రమాలు , రక్త దానాలు వంటివి కూడా గట్టిగానే చేస్తారు. కాలేజీలలో సెలెబ్రేషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటాయి. అయితే గత నాలుగేళ్ల నుండి మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు పాత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేశాయి. ప్రస్తుతానికి మొదటి రోజు రికార్డు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖాతాలోనే ఉంది. ఆయన హీరో గా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ ని 2024 సెప్టెంబర్ 2న విడుదల అవ్వగా, మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇప్పటి వరకు ఈ రికార్డు ని ఎవ్వరూ ముట్టుకోలేకపోయారు.ఈ రికార్డు ని మళ్లీ మేమే బద్దలు కొడుతాం , ఈ ఏడాది అని పవన్ కళ్యాణ్ అభిమానులు సవాలు చేశారు. ఎందుకంటే ఈ పుట్టినరోజు కి పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ‘బద్రి’ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కోర్టు లో ఆ సినిమాకు కొన్ని సమస్యలు ఉండడం వల్ల , ఆ చిత్రానికి బదులుగా ‘పంజా’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. పంజా సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఓపెనింగ్స్ అయితే అప్పట్లో బాగానే వచ్చాయి కానీ , అత్యధిక శాతం మంది జనాలు ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘బాలు’ తో పోలి ఉండడం చూసి నెగెటివ్ టాక్ చెప్పుకొచ్చారు.

పైగా ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ లేకపోవడం కూడా అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అందుకే అప్పట్లో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. కానీ కాలక్రమేణా ఈ చిత్రానికి జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అల్ట్రా స్టైలిష్ లుక్స్ , యాక్టింగ్ , ఫైట్ సన్నివేశాలు , ఇవన్నీ కూడా నేటి తరం ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టేలా చేశాయి. ‘ఓజీ’ చిత్రం కంటే , ‘పంజా’ సినిమానే బాగుందని, ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయ్యినందుకు చాలా బాధపడుతున్నామని , ఇప్పుడు విడుదల చేస్తే రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయని అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ చిత్రాన్ని రీ ఎడిట్ చేసి , ఈ ఏడాది సెప్టెంబర్ 2 న గ్రాండ్ గా విడుదల చెయ్యాలని చూస్తున్నారు, మరి అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version