Pregnancy confirmation advice: భారతదేశంలో కొన్ని పురాతన సాంప్రదాయాలు, పద్ధతులు ఇప్పటికీ చాలామంది అవలంబిస్తూనే ఉంటారు. వీటి ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతూ ఉంటారు. అయితే నేటి కాలం యువత వాటిని మూఢనమ్మకాలు అని కొట్టి పారిస్తారు. పురాతన కాలంలో పెద్దలు ఉపయోగించే కొన్ని పద్ధతులను ఇప్పుడు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని నిరూపించారు కూడా. వాటిలో ప్రెగ్నెన్సీ గురించి చెప్పుకుందాం.
పురాతన కాలంలో ప్రెగ్నెన్సీని ఒక పవిత్ర కార్యంగా భావించేవారు. ఒక అమ్మాయి గర్భవతి అయింది అని తెలవగానే ఆమెను ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. అయితే అత్తవారి ఇంట్లో ఉన్న సమయంలో ఈ విషయం తెలియగానే పుట్టింటికి పంపించేవారు. ఎందుకంటే పుట్టింటి లో ఆమె ఎంతో సంతోషంగా ఉండగలుగుతుంది. ఆమె పడే సంతోషం పుట్టే బిడ్డపై కూడా పడుతుంది. అందువల్ల స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూసుకునేవారు.
అయితే ఇంతకంటే ముందు ఒక విషయాన్ని గోప్యంగా ఉంచేవారు. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పేవారు కాదు. మూడు నెలలపాటు ఈ విషయాన్ని బయటకు తెలియకుండా ఉండేవారు. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నా విషయం బయటకు తెలిస్తే ఎన్నో దుష్ట శక్తులు, నరదృష్టి ఆ పుట్టబోయే బిడ్డపై పడుతుందని భావించేవారు. ఇలా ముందు ఆ విషయాన్ని తెలిస్తే ఎవరైనా ప్రతికూల శక్తులను ఉపయోగించేవారు. దీంతో పుట్టబోయే పుట్టబోయే బిడ్డ మధ్యలోనే మరణించేవారు. అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనగానే వెంటనే చెప్పకుండా మూడు నెలల పాటు గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు కూడా కొందరు డాక్టర్లు మూడు నెలలు అయితే గాని కన్ఫామ్ చేయడం లేదు. అయితే ఈ విషయం చాలామందికి తెలిసినా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తెలియగానే వెంటనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చెబుతున్నారు.
నేటి కాలంలో ప్రెగ్నెన్సీ అని తెలియగానే కొందరు జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. ఒకవైపు కన్ఫామ్ అని తెలిస్తే శారీరకంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో పురుషులు మహిళల పట్ల గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండాలి. వారిని కొన్నాళ్లపాటు జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా వారిని కొన్ని నెలలపాటు సంతోషంగా ఉండే విధంగా తయారు చేయాలి. ఐదు నెలల తర్వాత అండం పిండం గా మారుతుంది. ఈ సమయంలో బయట ఉండే వాతావరణం ఆ పిండంపై పడుతుంది. అందువల్ల ఇంట్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఏర్పాటు చేయాలి.