Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అటు అభిమానులు , ఇటు ప్రేక్షకులు ఒక రేంజ్ అంచనాలను పెట్టుకొని ఎదురు చూస్తున్న చిత్రం #OG. #RRR వంటి పాన్ వరల్డ్ సెన్సేషన్ తర్వాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుండి తెరకెక్కుతున్న ఈ సినిమా కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు విరామం లేకుండా సాగిన ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ నేటితో ముగియనుంది.
మళ్ళీ తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో జరగబోతుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నాడు. ఆగస్టు లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి, డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా షెడ్యూల్స్ మరియు ఆర్టిస్టుల డేట్స్ ని ప్లాన్ చేసుకున్నాడట డైరెక్టర్. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు.
అంతే కాకుండా ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ , సంజయ్ దత్ ని కూడా రెండు ముఖ్యమైన పాత్రలకు గాను చర్చలు జరుపుతున్నారు మేకర్స్. మరి వీళ్ళు చేస్తున్నారా లేదా అనేది అతి త్వరలోనే అధికారికంగా తెలియనుంది. ఇక పోతే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ పేరు ‘ఓజాస్ గంభీర’ అలియాస్ #OG అట. అందరూ ఆయనని సినిమాలో OG అని పిలుస్తూ ఉంటారు. ఇందులో పవన్ కళ్యాణ్ జపాన్ ని ప్రాణాంతక ఆయుధాలను స్ముగ్లింగ్ చేసే ముంబై పోర్టు డాన్ గా కనిపించబోతున్నాడు.
మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నాడట. ఇలా ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చెయ్యబోతున్నాడు డైరెక్టర్ సుజీత్.ఇప్పటి వరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రాకుండానే ఈ సినిమా మీద ఈ స్థాయి అంచనాలు ఉన్నాయి, ఒక్కసారి ఫస్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ ఇవన్నీ వస్తే ఇక ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.