OG Trailer Release Date :పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఓజీ సినిమా విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఈ సినిమా చాలా ప్రస్టేజియస్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా విషయంలో ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ అయిన సుజిత్(Sujeeth) సైతం ఈ సినిమాని హిట్టుగా నిలిపే విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికి టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ప్రణాళిక రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆగస్టు మొదటి వారం నుంచే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని చేపడతారట. ఆగస్టు 15వ తేదీన సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే రేంజ్ లో ట్రైలర్ రికార్డులను క్రియేట్ చేస్తుందనే కాన్ఫిడెంట్ తో వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సినిమాలకి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆయన సినిమాలను చూడడానికి ప్రతి ప్రేక్షకుడు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
ఇక ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మార్షల్ ఆర్ట్స్ చేయబోతున్నాడు కాబట్టి ఈ సినిమాలో ఫైట్స్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి… ఇక ఈ సినిమాతో సుజీత్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోవడం పక్కా అంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఈ సినిమా రిలీజ్ కి ముందే పెను రికార్డులను క్రియేట్ చేస్తుంది అనే అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా హై రేంజ్ లో జరగబోతుంది అనేది కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను సంతోష పెడుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరొక రెండు నెలపాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…
పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ లో ఒక భారీ రికార్డు ను క్రియేట్ చేస్తుందనే పేరు అయితే ఉంది. ఇక ఈ మధ్యకాలం లో ఆయనకు భారీ హిట్ అయితే రాలేదు. ఓజీ తో అది నెరవేరబోతున్నట్టుగా తెలుస్తోంది…