Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు చాలా రాదుగా ఉంటారనే చెప్పాలి. ఆయన సినిమా హిట్ అయిన, ఫ్లాప్ అయిన ప్రేక్షకుల నుంచి ఆయనకు వచ్చే స్పందన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తన అభిమానులు ఆయన కోసం ప్రాణాలైనా సరే ఇచ్చేంత పిచ్చితో ఉంటారు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. నిజానికి ఆయనలాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉంచిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veramallu) సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన ఇప్పుడు సుజిత్ (Sujeeth) డైరెక్షన్లో చేస్తున్న ఓజి (OG) సినిమా కోసం తన పూర్తి డేట్స్ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ అయితే ఉన్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!
మరి దర్శకుడు యొక్క విజన్ కి తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా గత ఏడాది థియేటర్లకి రావాల్సిందే కానీ అనుకోని కారణాలవల్ల షూటింగ్ లేట్ అవుతూ రావడం వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది.
ఇక ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి సుజిత్ ఇప్పటికే ఈ సినిమా మీద చాలా రోజులపాటు తన టైమ్ ను కేటాయిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఎట్టకేలకు ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు. కాబట్టి ఆయన సినిమాలు ఎప్పుడొచ్చినా కూడా భారీ విజయాలను సాధిస్తూ భారీ ఓపెనింగ్స్ ను కూడా తీసుకొచ్చి పెడతాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : నేటి నుండి ఓజీ షూటింగ్ ప్రారంభం..పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే!