Pawan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న నాలుగు సినిమాలలో బులెట్ వేగంతో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న చిత్రం #OG. డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న యాక్షన్ జానర్ సినిమా ఇది.
ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ముంబై మరియు పూణే లో దాదాపుగా నెల రోజుల పాటు ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ , మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాడు సుజిత్. ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని హైదరాబాద్ లో నేడు ప్రారంభించారు.ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా మిగిలిన తారాగణం కూడా పాల్గొనబోతుంది.
ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ షెడ్యూల్ పూర్తి అయినా తర్వాత ఫ్యాన్స్ కోసం ఒక చిన్న గ్లిమ్స్ వీడియో ని కూడా విడుదల చెయ్యబోతున్నారు.రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిమ్స్ వీడియో ని చూసి పూనకాలు వచ్చి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ #OG చిత్రం గ్లిమ్స్ వీడియో కి ఏమైపోతారో అని విశ్లేషకులు అంటున్నారు.
త్వరలోనే దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన కూడా బయటకి రాబోతుంది అట.ఇప్పటికే ట్విట్టర్ ద్వారా #OG లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన స్టైలిష్ లుక్స్ ని అప్డేట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ని ఇచ్చారు. వర్కింగ్ స్టిల్స్ కి ఆ రేంజ్ సెన్సషనల్ రెస్పాన్స్ వస్తే ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కి మరియు గ్లిమ్స్ వీడియో కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.