Pawan Kalyan OG : కోట్లాది మంది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో నెల రోజుల్లో మన ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులకంటే ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూసే సందర్భం వచ్చింది. రీ ఎంట్రీ తర్వాత ఆయన అత్యధికంగా రీ మేక్ సినిమాలకు పరిమితం అవ్వడం వల్ల, కేవలం ఆయన సినిమాలను అభిమానులు మాత్రమే ఎక్కువగా చూసేవారు. మామూలు మూవీ లవర్స్ మాత్రం రీమేక్ సినిమాలంటే ఆసక్తి చూపించేవారు కాదు. అలాంటి సమయం లో ‘ఓజీ’ చిత్రం పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ సినిమా అని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, అదే విధంగా ఫైర్ స్ట్రోమ్ వీడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకొని ఆడియన్స్ లో ఉన్న నమ్మకాన్ని మరింత బలపర్చింది
ముఖ్యంగా ఈ చిత్రం కోసం ఓవర్సీస్ ఆడియన్స్ మెంటలెక్కిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడుతారో, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుందామా అనేంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానులకు ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్ నిన్న రాత్రి ఒక శుభవార్త ని తెలియచేసాడు. ఈ నెల 29వ తారీఖు నుండి నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టబోతున్నామని, ఈసారి రికార్డ్స్ వేట మామూలుగా ఉండదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా లో అత్యధిక ప్రీమియర్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ గత కొంతకాలం గా తన స్టార్ స్టేటస్ కి తగ్గ ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లను పెట్టలేకపోతున్నాడు. ఆయన గత చిత్రం ‘హరి హర వీరమల్లు’ కి అయితే కనీసం 1 మిలియన్ ప్రీమియర్ గ్రాస్ కూడా రాలేదు.
ఆ సినిమా నుండి మొదటి నుండి హైప్ లేకపోవడం, అనేక సార్లు వాయిదా పడడం వల్లే కావాల్సినంత హైప్ క్రియేట్ అవ్వలేదని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. కానీ ఓజీ చిత్రానికి అలాంటి పరిస్థితులు లేవని, అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగానే ఫైర్ స్ట్రోమ్ లాగా టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయని, కచ్చితంగా ప్రీమియర్ షోస్ గ్రాస్ విషయం లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్పబోతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రీమియర్ షోస్ గ్రాస్ రికార్డు కల్కి మూవీ ఖాతాలో ఉంది. ఈ చిత్రానికి సుమారుగా 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని భారీ హైప్ తో వచ్చిన ‘దేవర’, ‘పుష్ప 2’ చిత్రాలు కూడా అందుకోలేకపోయాయి, మరి ఓజీ చిత్రం అయినా అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.