Bigg Boss Telugu 9 Agnipariksh Navdeep: బుల్లితెర మీద వండర్స్ ని క్రియేట్ చేస్తూ అత్యధిక టిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకెళ్లిన ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్.. ఎనిమిది సీజన్ లను సక్సెస్ ఫుల్ గా కంప్లి చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల ఏడోవ తేది నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వబోతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇందులో సామాన్యులను సైతం భాగం చేయాలనే ఉద్దేశ్యంతో అగ్ని పరీక్ష అనే పేరుతో ఒక షోని కండక్ట్ చేస్తున్నారు…ఈ షోలో ఎవరైతే తమ టాలెంట్ ని చూపించుకొని జడ్జ్ లను ఇంప్రెస్ చేస్తారో వాళ్లకు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే దక్కుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే అగ్నిపరీక్ష థర్డ్ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
ముఖ్యంగా సిద్దిపేట మోడల్ కంటెస్టెంట్ గా వచ్చినప్పుడు అతను కొన్ని రీల్స్ చేస్తూ ఇన్ స్టా లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే నవదీప్ తనని ఉద్దేశిస్తూ మీరు ఆల్రెడీ సెలబ్రిటీగా మారిపోయారు. మరి మిమ్మల్ని ఎందుకు అగ్నిపరీక్షలోకి సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు అన్నట్టుగా మాట్లాడాడు.
మరి అతను సెలబ్రిటీ అయితే అనూష రత్నం, దివ్య నిఖిత లాంటివారు సిద్దిపేట్ మోడల్ కంటే ఇంకా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలు మరి వీళ్లను వదిలేసి నవదీప్ కేవలం సిద్దిపేట మోడల్ మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు.
కాదంటూ కొంతమంది నెటిజన్లు సైతం నవదీప్ మీద ఫైర్ అవుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా నవదీప్ లాంటి వ్యక్తి జడ్జ్ ప్లేస్ లో ఉండి అలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఇప్పుడు అగ్నిపరీక్ష అనేది ప్రతి ఒక్కరికి చాలా టఫ్ ఫైట్ గా మారింది. ఇక జడ్జెస్ నుంచి గ్రీన్ మార్క్ ను పొందడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు జడ్జెస్ ను ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు…