Pawan Kalyan New Movie Rules: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ తనకంటూ ఒక మేనియా ను క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో రాణిస్తూనే సినిమా ఇండస్ట్రీలో సైతం తన సత్తా చాటుతున్నాడు. అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా అతని అభిమానులను మాత్రం ఎక్కడా నిరాశపర్చడం లేదు… రీసెంట్ గా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా డివైడ్ టాక్ సంపాదించుకున్నప్పటికి పవన్ కళ్యాణ్ మార్క్ మాత్రం కనిపించింది. ఇక గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ గా కనిపించడమే కాకుండా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సైతం అలాంటి ఒక లుక్ లో కనిపించడంతో ప్రేక్షకులంతా సంబరపడిపోతున్నారు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
పవన్ కళ్యాణ్ ఇకమీదట నుంచి స్టైలిష్ లుక్ లో కాకుండా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారట. కాస్ట్యూమ్స్ విషయంలో గాని, తను చెప్పే డైలాగులు గాని అన్నింటి విషయంలో చాలా మార్పులు చేర్పులు చేయాబోతున్నారట.
ఎందుకంటే రొటీన్ కమర్షియల్ హీరోలా కాకుండా ఇప్పుడు తను ఒక డిప్యూటీ సీఎం అనే పదవిలో ఉన్నాడు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన కార్యచరణ కూడా ఉండబోతుందట. ప్రతి కథను చాలా క్షుణ్ణంగా విన్న తర్వాత సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తనకి ఎలాంటి కథలైతే బాగుంటాయో అలాంటి వాటిని తన దగ్గరకి తీసుకొస్తున్నారట.
ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కండిషన్స్ ఉండబోతున్నాయి. మరి దర్శకులు వాటిని ఒప్పుకుని అతనితో సినిమాలు చేయడానికి సిద్ధమవుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…