Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాల మీద క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్... ఆ ఇద్దరు...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాల మీద క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్… ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఫిక్స్…

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు ఆయన కథల సెలెక్షన్ ఒకలా ఉండేది. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టైల్ ఇంకోలా మారిపోయింది. గతంలో ఆయన ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికే సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సినిమాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి తను ఎలాగైనా సరే అటు […]

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు ఆయన కథల సెలెక్షన్ ఒకలా ఉండేది. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టైల్ ఇంకోలా మారిపోయింది. గతంలో ఆయన ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికే సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సినిమాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు.

కాబట్టి తను ఎలాగైనా సరే అటు రాజకీయ రంగంలో రాణిస్తూ తన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చిల్లరగా ఉండే కథలతో సినిమా చేస్తే బాగోదు. ఆయన ఏం చేసిన కూడా సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. తప్ప సొసైటీని మిస్ లీడ్ చేసే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే మంచి కథల కోసం వెతుకుతున్నాడు.

ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పిన ఒక కథ కొంతవరకు పవన్ కళ్యాణ్ కి ఓకే అనిపించినప్పటికి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఇంకా బాగుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పాడట. ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్టర్ త్రివిక్రమ్ సైతం ఆ కథ మీద కూర్చొని వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలన్నా కూడా అది ముందుగా త్రివిక్రమ్ దగ్గరికి వెళ్తుంది.

ఆయన ఫైనల్ చేసిన తర్వాతే ఆ సినిమాని పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ ప్రస్తుతం రెండు కథలను ఒకే చేసినట్టుగా తెలుస్తుంది. అందులో ఒకటి సురేందర్ రెడ్డి మూవీ కాగా, మరొకటి ఒక తమిళ్ దర్శకుడుది కావడం విశేషం…అయితే ఆ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సురేందర్ రెడ్డి సినిమా మాత్రం స్ట్రెయిట్ కథతో వస్తుంది. కానీ తమిళ్ దర్శకుడితో చేయబోతున్న సినిమా విషయంలోనే అది ఒరిజినల్ కథతో వస్తుందా? లేదంటే రీమేక్ కథగా తెరకెక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper