https://oktelugu.com/

విజ‌య్ దేవ‌ర‌కొండ థియేట‌ర్లో.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బొమ్మ‌!

నిన్న‌టి త‌రం హీరోల వ‌ర‌కు సినిమానే ప్యాష‌న్ గా ముందుకు సాగారు. సినీ రంగాన్నే న‌మ్ముకొని నిల‌బ‌డ్డారు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోతోంది. స్టార్ హీరోలు సినిమాలు తీస్తూనే.. మ‌రోవైపు వ్య‌క్తిగ‌తంగా వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో క‌లిసి ఏఎంబీ సినిమాస్ ను మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ థియేట‌ర్ కు ఇండియాలోనే బెస్ట్ థియేట‌ర్ గా క్రేజ్ వ‌చ్చింది. Also Read: మెగాస్టార్ కి ఈ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 19, 2021 / 04:12 PM IST
    Follow us on


    నిన్న‌టి త‌రం హీరోల వ‌ర‌కు సినిమానే ప్యాష‌న్ గా ముందుకు సాగారు. సినీ రంగాన్నే న‌మ్ముకొని నిల‌బ‌డ్డారు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోతోంది. స్టార్ హీరోలు సినిమాలు తీస్తూనే.. మ‌రోవైపు వ్య‌క్తిగ‌తంగా వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో క‌లిసి ఏఎంబీ సినిమాస్ ను మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ థియేట‌ర్ కు ఇండియాలోనే బెస్ట్ థియేట‌ర్ గా క్రేజ్ వ‌చ్చింది.

    Also Read: మెగాస్టార్ కి ఈ వయసులో ఒకేసారి రెండు అంటే.. ?

    ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా మ‌హేష్ బాబును ఫాలో అవుతున్నాడు. ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి ‘ఏషియ‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాస్‌’ పేరుతో ఓ థియేటర్ ను సిద్ధం చేస్తున్నాడు. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ఉన్న తిరుమల థియేటర్ ను పూర్తిగా రీ మోడలింగ్ చేస్తున్నారు. ఈ థియేటర్ లో బిగ్గెస్ట్ స్క్రీన్ ను ఏర్పాటు చేసి, గ్రాండ్ గా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు వీడీ.

    అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ థియేటర్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బొమ్మతో ప్రారంభించాలని చూస్తున్నాడట విజయ్. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ థియేటర్ కు సంబంధించిన పనులు త్వరలోనే ముగియనున్నాయి. ధూమ్ ధామ్ గా ఓ రేంజ్ లో ఈ థియేటర్ ను నిర్మిస్తున్నారు.

    Also Read: హీరో పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు !

    అయితే.. సినిమా హాల్ లో మొదటి బొమ్మ పవర్ స్టార్ దే కావాలని చూస్తున్నారట. పవర్ స్టార్ వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అప్పటి లోగా సర్వం సిద్ధం చేసి, పవన్ కల్యాణ్ సినిమాతోనే ఓపెనింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్