Pawan Kalyan Meets Allu Arjun: అల్లు కుటుంబం లో నిన్న తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి నాన్నమ్మ అయినటువంటి అల్లు కనకరత్నం స్వర్గస్తులు అవ్వడం తో మెగా ఫ్యామిలీ మొత్తం శోకసంద్రం లో మునిగిపోయింది. నిన్న మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండడం, కనకరత్నం అంత్యక్రియలు దగ్గరుండి జరిపించడం,అందుకు సంబంధించిన వీడియోలు మనం సోషల్ మీడియా లో చాలానే చూసాము. మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఈ విషాద సమయం లో అల్లు కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు కానీ, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాత్రం రాలేకపోయాడు అని, మెగా హీరోలందరితో కలిసి ఆయన్ని చూడలేకపోయామని అంతా అనుకున్నారు. నిన్న అంత్యక్రియ కార్యక్రమం లో ఆయన పాల్గొనలేకపోయాడు. అందుకు కారణం వైజాగ్ లో జనసేన పార్టీ కార్యకర్తలతో ముగింపు సమావేశం ఉండడం వల్లనే అట. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన నిన్న రాత్రి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని మొత్తం పరామర్శించి తిరిగి మళ్ళీ మంగళగిరి కి వచ్చేశాడు.
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను ఆయన కలిసిన ఫోటోలను కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో విడుదల చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ని ఒకే ఫ్రేమ్ లో చూసినందుకు అభిమానులు సంతోషించాలో, లేదా వీళ్ళు కలవడానికి విచారకరమైన సందర్భం ఎదురు అవ్వడం వల్ల బాధ పడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అభిమానులకు. ఏది ఏమైనా చాలా కాలం నుండి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సఖ్యత లేదు, ఎప్పుడు చూసినా ఈ ఇరువురి హీరోల అభిమానులు గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక చోటకు చేరడం చూసిన తర్వాత వాళ్ళ మధ్య గొడవలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సోషల్ మీడియా లో ఉండే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.