Pawan Kalyan : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో షూటింగ్స్ సెట్స్ లోకి అడుగుపెడుతాడా, ఎప్పుడెప్పుడు ఆయన సినిమా విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన సినీ నిర్మాతలకు అసలు దొరకడం లేదు. దొరికినా కొద్దీ రోజులు షూటింగ్ చేసి, భారీ గ్యాప్ ఇచ్చేవాడు. ఈ నెల ప్రారంభంలోనే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమాని పూర్తి చేద్దామని అనుకున్నాడు కానీ, విపరీతమైన జ్వరం, వెన్ను నొప్పి కారణంగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. నిన్న గాక మొన్న జరిగిన 16 వ ఫైనాన్స్ కమీషన్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ సెలైన్ బాటిల్ పెట్టుకొని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఇప్పట్లో పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనడం కష్టమే అని అంతా అనుకున్నారు.
Also Read : ‘ఓజీ’ ఈ ఏడాది లో విడుదల అవ్వడం కష్టమేనా..? జూన్ లో ఏమి జరగబోతుంది?
కానీ మే నెలలో ఆయన ఓజీ(They Call Him OG) సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తానని నిర్మాత DVV దానయ్య నిన్న అధికారికంగా తెలిజేశాడట. అదే విధంగా ఈ నెలలోనే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ని కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. కేవలం నాలుగు రోజుల డేట్స్ ఈ చిత్రానికి ఇస్తే సరిపోతుంది. గ్రాఫిక్స్ వర్క్ మొత్తం కూడా పూర్తి అయ్యిందట. మే మూడవ వారం లో కానీ, లేదా చివరి వారం లో కానీ ఈ సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. మరో వారం రోజుల్లో దీనిపై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా దాదాపుగా 5 ఏళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అనేక అడ్డంకులను ఎదురుకుంటూ ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రొమోషన్స్ కూడా మే 1 నుండి గ్రాండ్ గా ప్రారంభిస్తారని తెలుస్తుంది.
ఇక ఓజీ విషయానికి వస్తే ఎట్టిపరిస్థితిలో ఈ చిత్రాన్ని మే నెలలో పూర్తి చేయాలనీ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడట. ఈ సినిమా పూర్తి అవ్వడానికి పవన్ కళ్యాణ్ 10 నుండి 20 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మే నెలలో షూటింగ్ పూర్తి అయితే సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఈ సినిమా పై మంచి క్రేజ్ ఉంది. మొదటిరోజు ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతటి స్టామినా ఉన్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. ఈ రెండు సినిమాలకు సూపర్ హిట్ టాక్ వస్తే కేవలం పవన్ కళ్యాణ్ నుండి 1500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మన టాలీవుడ్ కి వస్తుంది.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..?