Pawan Kalyan: ‘పల్లె పండుగ 2.0’ లో భాగంగా కోనసీమ లోని రాజోలు నియోజకవర్గం లో రీసెంట్ గానే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఆంద్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కోన సీమ కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ జనాలు దిష్టి పెడుతున్నారు, అందుకే అవి ఎండిపోతున్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించాడని , తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని ముందుగా BRS పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక నేడు తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ, నీ సినిమాలను తెలంగాణ లో ఆడనివ్వం, మర్యాదగా క్షమాపణలు చెప్పు అంటూ డిమాండ్ చేశారు. సాక్ష్యాత్తు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కి ఇలాంటి వార్నింగ్ ఇచ్చాడు.
అయితే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తాడా లేదా? , క్షమాపణలు చెప్తాడా లేదా అని అనుకుంటున్న సమయం లో కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ నుండి ఒక ప్రకటన విడుదలైంది. అందులో ‘రాజోలు నియోజగవర్గం లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా రైతులతో ముచ్చటిస్తూ మాట్లాడిన మాటలను తెలంగాణ మంత్రులు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సఖ్యత ఉన్న ఈ సమయం లో వాస్తవ మాటలను వక్రీకరించి విబేధాలు సృష్టించకండి’ అంటూ ఆ లేఖ లో చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అసలు తమ అభిమాన నాయకుడు ఏమి మాట్లాడాడో వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ లోని కొంతమంది నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినట్టుగా వక్రీకరించి చూపించారని, ఇలాంటి నీచమైన రాజకీయాలు ఇకనైనా మానుకోండి అని, తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా జనాల దృష్టిని మరలించేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కాంగ్రెస్ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.
మాటలను వక్రీకరించవద్దు pic.twitter.com/bFETR1xt5T
— JanaSena Party (@JanaSenaParty) December 2, 2025