
Dil Raju : చిన్న డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. రెండు దశాబ్దాల కెరీర్లో దిల్ రాజు తెలుగు సినిమాకు అపూర్వ విజయాలు అందించారు. ఈ జర్నీలో అనేక ఎత్తుపల్లాలు చూశారు. నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తూనే తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. స్టార్ హీరోల సినిమాలన్నీ దాదాపు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ క్రమంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలు తనకు భారీ షాక్ ఇచ్చాయని వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన భారీ నష్టాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మహేష్ బాబు-మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ చిత్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు కొన్నారట. ఆ మూవీ మీదున్న హైప్ రీత్యా భారీ ధర చెల్లించారట. స్పైడర్ డిజాస్టర్ కాగా పెట్టుబడిలో సగం కూడా రాలేదు. దిల్ రాజుకు స్పైడర్ మూవీ రూ. 12 కోట్ల నష్టం మిగిల్చిందట. ఆ షాక్ నుండి కోలుకునే లోపు పవన్ కళ్యాణ్ మూవీ మరో భారీ కుదుపుకు గురి చేసిందట.

అత్తారింటికి దారేది భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అదే స్థాయిలో నిర్మాతలు ఆ చిత్ర థియేట్రికల్ రైట్స్ అమ్మారు. దిల్ రాజు ఫ్యాన్సీ ధర చెల్లించి అజ్ఞాతవాసి దక్కించుకున్నారు. ఆ మూవీ ప్లాప్ కావడంతో ఆయనకు రూ. 13 కోట్ల నష్టం వచ్చిందట. మహేష్-పవన్ కళ్యాణ్ ల చిత్రాలకు కలిపి రూ. 25 కోట్లు నష్టం వాటిల్లిందని దిల్ రాజు వెల్లడించారు. ఇంకొకరైతే పరిశ్రమ నుండి వెళ్లిపోయేవారని… ఆయన చెప్పుకొచ్చారు.
దిల్ రాజు ఈ మధ్య చిన్న బ్యానర్ ఒకటి స్టార్ట్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో స్మాల్ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. కూతురు హన్షిత రెడ్డి ఈ బ్యానర్ బాధ్యతలు చూసుకుంటున్నారు. బలగం ఆమె నిర్మించిన చిత్రమే. పావలా పెట్టుబడికి బలగం సినిమా రూపాయి సంపాదించింది. లాభాల లెక్కలు పక్కన పెడితే దిల్ రాజుకు ఎక్కడలేని గౌరవం తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ అవార్డ్స్ దక్కించుకుంటుంది.