Khushi Movie Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి శుభవార్త..న్యూ ఇయర్ కానుకగా అల్ టైం క్లాసికల్ బ్లాక్ బస్టర్ ఖుషి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో డిసెంబర్ 31 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు..ఈ విషయాన్నీ నేడు ఆ చిత్ర నిర్మాత AM రత్నం అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసారు..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎంతో ప్రత్యేకం..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సుమారు పదేళ్ళ పాటు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ని బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని సూపర్ స్టార్ గా నిలబెట్టింది ఈ చిత్రం..అంతే కాకుండా అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అన్నీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఫ్యాక్షన్ మూవీస్ మరియు మాస్ మూవీస్ రాజ్యం ఏలుతున్న ఆ రోజుల్లో ఒక అర్బన్ లవ్ స్టోరీ ఆ రేంజ్ సక్సెస్ సాధించడం అంటే మాములు విషయం కాదు.
అప్పట్లో ఈ చిత్రాన్ని వంద రోజుల తర్వాత రీ రిలీజ్ చేస్తే ప్రభంజనం సృష్టించింది..రీ రిలీజ్ లో కూడా ఆరోజుల్లోనే 5 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసింది ఆ చిత్రం..ఇప్పుడు సరికొత్త 4K టెక్నాలజీ కి మార్చి , 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్స్ తో ఈ చిత్రాన్ని రీస్టోర్ చేసారు..అభిమానులకు మరియు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా ఈ చిత్రాన్ని రీ మాస్టర్ చేసారు..కచ్చితంగా రికార్డ్స్ ని భారీ మార్జిన్ తో బద్దలు కొడుతోంది అని ఫ్యాన్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు.

సెప్టెంబర్ 1 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేసిన జల్సా మూవీ స్పెషల్ షోస్ కి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే..ఇప్పటికి ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి..కానీ జల్సా సినిమా సృష్టించిన యుఫొరియా మాత్రం ఎవ్వరు బ్రేక్ చెయ్యలేదు..సుమారు మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని ఆ చిత్రం వసూలు చేసింది..ఇప్పుడు ఖుషి కి కనీసం పది కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.