Pawan Kalyan: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క సినిమా అభిమాని కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయిపోతాడు. ఇంకా యూత్ అయితే పవన్ కళ్యాణ్ స్టైల్ చూస్తే ఫిదా అయిపోతారు.
ఇక మనందరికీ ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ మరి ఆయన కి ఇష్టమైన హీరో ఎవరు అని మనందరికీ తెలుసుకోవాలనే ఆసక్తి అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరో చిరంజీవి అని చాలా సార్లు చెప్పాడు. కానీ చిరంజీవి కాకుండా తనకి ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే అమితా బచ్చన్ గారంటే తనకి చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన చిరంజీవి, అమితాబచ్చన్ లా సినిమాలు చూస్తూ యాక్టింగ్ కి సంబంధించిన మెలకువలు కూడా చాలా నేర్చుకున్నాను అని ఒక సందర్భం లో చెప్పాడు. చిరంజీవి, అమితాబచ్చన్ అంటే తనకు ఇష్టమని అందుకే ఎక్కువగా వాళ్ల సినిమాలు చూస్తూ ఉండేవాడినని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు…
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే 2023 వ సంవత్సరంలో వచ్చిన బ్రో సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆ సినిమా పట్ల పెద్దగా సంతృప్తి చెందినట్టుగా కనిపించలేదు. అందుకే హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నా ఓజీ సినిమాల విషయంలో ఈసారి లెక్క తప్పదు ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయని అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు…
అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ రెండు సినిమాల మీద కొంచెం ఎక్కువగానే కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏపిలో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఆయన సినిమా షూట్స్ కు బ్రేక్ ఇచ్చి ఎలక్షన్స్ క్యాంపెనింగ్ లో బిజీ గా తిరుగుతున్నారు. ఇక అవి ముగిసిన వెంటనే రెండు సినిమా షూటింగుల్లో తను ఫుల్ గా పాల్గొనబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది…