Pawan Kalyan: రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులు పార్టీలుగా డివైడ్ అయిపోయి ఉండొచ్చు కానీ, మన చిన్నతనం లో చిరంజీవి కి , యవ్వనం లో పవన్ కళ్యాణ్ కి ఫ్యానిజం చేయకుండా ఉండలేము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే , ఒకానొక దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూత్ కి ఏకైక రోల్ మోడల్ ఆయనే. తొలిప్రేమ , సుస్వాగతం , తమ్ముడు , బద్రి , ఖుషి అంటూ ఆయన ఒక జనరేషన్ యూత్ మొత్తాన్ని తన ఫ్యాన్ బేస్ గా మార్చేసుకున్నారు. యూత్ లో ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి కి కూడా పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదు అనేవారు విశ్లేషకులు. ముఖ్యంగా 90’s యువత అయితే ఇప్పటికీ ఆయన్ని అదే రేంజ్ లో ఆరాధిస్తుంటారు. అందులో మన ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి , బీజేపీ నాయకుడు సత్య కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
నేడు ఆయన ఒక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ‘జానీ’ చిత్రం లోని పాపులర్ సాంగ్ ‘నారాజు గారకురా మా అన్నయ్య’ అనే పాటకు తోటి అభిమానులతో కలిసి చిందులేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం సమయం లో కూడా తాను పవన్ కళ్యాణ్ అభిమాని అనే చెప్పుకుంటూ వచ్చారు. తన నియోజకవర్గం లో కూడా ఎమ్మెల్యే గా గెలిచేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సహాయపడ్డారు. ఇప్పుడు మరోసారి ఆయనలోని వింటేజ్ పవన్ కళ్యాణ్ అభిమాని బయటకు వచ్చి , తన స్థాయి ని కూడా మర్చిపోయి చిందులు వేయడాన్ని చూసి , పవన్ అభిమానులు ‘పవనిజం’ లో మ్యాజిక్ అదే సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతూ ఫుల్ బిజీ గా ఉంటూనే, మరోపక్క సినిమాలు కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గానే ఆయన ‘ఓజీ 2’ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నేడు ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు , మెంటలెక్కిపోతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కలేదని , పవన్ కళ్యాణ్ సుజిత్ కి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే వండర్స్ ని క్రియేట్ చేస్తాడని అంటున్నారు ఫ్యాన్స్ , నెటిజెన్స్.
