https://oktelugu.com/

Pawan Kalyan: హరీష్ శంకర్, సుజీత్ కెరియర్ లతో ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్… కారణం ఏంటంటే..?

ఏపీ ఎలక్షన్స్ కారణంగా కొద్ది రోజులుగా ఈ సినిమాల షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఈ సినిమాలను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఎలక్షన్స్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమా షూటింగ్ లకి పవన్ కళ్యాణ్ వస్తాడని హరీష్ శంకర్, సుజిత్ అనుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 28, 2024 / 12:04 PM IST
    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానం లో ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక అందులో ముఖ్యంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలని చేస్తున్నాడు.

    అయితే ఏపీ ఎలక్షన్స్ కారణంగా కొద్ది రోజులుగా ఈ సినిమాల షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఈ సినిమాలను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఎలక్షన్స్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమా షూటింగ్ లకి పవన్ కళ్యాణ్ వస్తాడని హరీష్ శంకర్, సుజిత్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా తెలుస్తున్న విషయం ఏమిటంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కాబట్టి ఎలక్షన్స్ తర్వాత వెంటనే ఆ సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ లెక్కన చూస్తే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఈ సంవత్సరంలో కూడా రిలీజ్ అవుతాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక దీంతో సుజిత్ తన సన్నిహితుల దగ్గర అనవసరంగా ఈ ప్రాజెక్టు చేస్తున్నానా అని భాద పడుతున్నట్టు గా తెలుస్తుంది. ఇక హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదనే ఉద్దేశ్యం తోనే రవితేజతో ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. ఇక ఇది చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన వైఖరి పట్ల కొంచెం అసంతృప్తి తో ఉన్నారు. ఎందుకంటే సెట్స్ మీద ఉన్న సినిమాలను తొందరగా కంప్లీట్ చేసి ఆ తర్వాత కొత్త సినిమాలను ఒప్పుకుంటే బాగుండేది. ఈ సినిమాలు పూర్తకముందే కొత్త సినిమాలను ఎందుకు ఒప్పుకుంటున్నాడు అంటూ వాళ్ళు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఈ రకంగా అన్ని సినిమాలను సగం సగం చేసుకుంటూ వెళ్తే ఆ సినిమాలు ఎప్పటికీ రిలీజ్ అవుతాయంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలని 50% కంప్లీట్ చేసి మూడు సినిమాలు రిలీజ్ అవ్వకముందే అట్లీ డైరెక్షన్ లో మరొక సినిమాకి కమిట్ అవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తుంది.